Monday, December 9, 2024

Breaking: ఆ ఇద్దరి చావుకు మంత్రి కొడాలి నాని కారణం: వర్ల రామయ్య

మంత్రి కొడాలి నానిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. గుడివాడకు చెందిన వైసీపీ నేతలు వంకా విజయ్, అడపా బాబ్జీల మృతికి మంత్రి కొడాలి వైఖరే కారణమని ఆయన ఆరోపించారు. బావ బామ్మర్దులైన ఇరువురు కొడాలి నాని ఎన్నికల కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టారని తెలిపారు.

వంకా విజయ్ 2015లో సూసైడ్ నోట్ రాసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆ సూసైడ్ నోట్ బయటకు రాకుండా కొడాలి నాని అడ్డుకున్నారని ఆరోపించారు. ఖర్చు పెట్టిన డబ్బు అంతా తిరిగి ఇస్తానన్న మంత్రి నాని ఇప్పుడు ముఖం చాటేయటంతో తీవ్ర ఒత్తిడికి లోనైన అడపా బాబ్జీ గుండెపోటుతో మరణించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో మంత్రి ఆగడాలపై డీజీపీ దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement