Saturday, May 4, 2024

Srisailam: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. అయిదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు ఏప్రిల్ 3 తేదీతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా జ్యోతిర్లింగస్వరూపుడైన మల్లికార్జునస్వామివారికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి అయిన శ్రీభ్రమరాంబాదేవి వారికి ప్రత్యేక పూజలు, శ్రీస్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీన ప్రభోత్సవం, వీరాచార విన్యాసాలు, ఉగాది రోజైన 2వ తేదీన ఉదయం పంచాంగశ్రవణం, పండిత సత్కారం, సాయంకాలం రథోత్సవం జరుగనున్నాయి.

ఉత్సవాల్లో భాగంగా వాహనసేవ అలంకార సేవ, భృంగివాహనసేవ నిర్వహిస్తారు. రేపు కైలాస వాహనసేవ, మహాలక్ష్మి మహాదుర్గ అలంకారం మహాసరస్వతి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1న ప్రభోత్సవం, నందివాహనసేవ, ఏప్రిల్ 2న రథోత్సవం రమావాణీ సేవిత ఉగాది రాజరాజేశ్వరి అలంకారం, ఈ నెల 5న అశ్వవాహనసేవ భ్రమరాంబాదేవి ఆలయ ఉత్సవం నిజాంకరణ ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement