Thursday, October 10, 2024

AP: మహాత్మా జ్యోతిరావు ఫూలేకు నేతల ఘన నివాళులు

శ్రీ సత్య సాయి బ్యూరో, నవంబర్ 28 (ప్రభ న్యూస్) : కదిరి మున్సిపాలిటీ స్థానిక పూలే సర్కిల్ నందు పూలే విగ్రహం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేశారని, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అన్నారు. వారు బడుగు, బలహీన వర్గాల కోసం చేసిన కృషి ఎనలేనిదని వారి కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


కందికుంట నివాళులు…
ఇదే సందర్భంలో కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఆయన వెంట పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఫూలేకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement