Saturday, October 12, 2024

Shruthi : సోష‌ల్ మీడియాలో శృతి పెంచుతోంది…..

శృతిహాసన్ కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినీ, పర్సనల్ విషయాలను అందరితో షేర్ చేసుకుంటుంది.. ఇక వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.. ఈ ఏడాది అమ్మడుకు బాగా కలిసివచ్చింది.. సీనియర్ హీరోల సరసన జతకట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.

ఈ ఏడాదిలో ఈమె నటించిన అన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే.. అదే జోష్ తో వరుస సినిమాలను లైన్లో పెడుతుంది హిట్ సినిమాలు ఉన్నా కూడా గ్లామర్ డోస్ పెంచుతుంది.. ఈ మధ్యకాలంలో హాట్ లుక్స్ ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది.. నిత్యం రకరకాల ఫోటోలను, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.. కాగా, తాజాగా శృతి హాసన్ బోల్డ్నెస్ కి తెరలేపింది. ఎద అందాలు హైలెట్ అయ్యేలా హాట్ ఫోటో షూట్ చేసింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలతో మతులు పోగొట్టింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ఇక కేరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ లో కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాల్లో ఇదే భారీ బడ్జెట్ పాన్ సినిమా కావడం విశేషం..సలార్ ట్రైలర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 1న విడుదల చేస్తున్నారని సమాచారం. సలార్ 2 కూడా ఉందని ప్రచారం జరుగుతుంది. అంటే శృతి హాసన్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నట్లే అవుతుంది… ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement