Sunday, May 19, 2024

ప్రభుత్వ ఆదేశాలకు లోబడి బదిలీలు : ద్వారకా తిరుమలరావు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగుల బదిలీలు ప్రభుత్వ ఆదేశాలకు లోబడే ఉంటాయని ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రూపొందించిన పోస్టర్ల ఆవిష్కరణలో పాల్గొన్న ఆయన విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైనందున ప్రభుత్వ నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఐదేళ్లు పైబడి సర్వీసు ఉన్న వారిని నిబంధనల మేరకు బదిలీలు చేస్తామన్నారు. ఆర్టీసీలో దూర ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులు స్వస్థలాలకు వెళ్లేందుకు పెట్టుకున్న అర్జీలను పరిశీలించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

తొందరలోనే ఒక విద్యుత్‌ బస్సును తిరుపతి-తిరుమల ఘాట్‌ రూట్లో నడపనున్నామని ఆయన తెలిపారు. ఆగస్టు నాటికి 50 బస్సులు, డిసెంబర్‌ చివరకు మరో 50 విద్యుత్‌ బస్సులు రానున్నట్లు ఆయన చెప్పారు. అద్దె బస్సుల విషయంలో నిబంధనల మేరకే యజమానులకు చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాధనం దుర్వినియోగం చేయమోమని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement