Thursday, May 16, 2024

ఏపీకి విరాళాల వెల్లువ

కరోనా వేళ పలు సంస్థలు ఏపీకి అండగా నిలుస్తున్నాయి. కోవిడ్‌ 19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రా ఆర్గానిక్స్‌ లిమిటెడ్స్‌(విర్కో గ్రూపు) రూ. కోటి విరాళం అందించింది. విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌కు అందజేశారు.

గత పది రోజుల్లో పలు సంస్థలు, వ్యక్తుల నుండి రూ. 6.72 కోట్ల విలువైన సాయం అందిందని కొవిడ్ స్పెషలాఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. మరో రూ.8 కోట్ల మేర సాయం అందనుందని వెల్లడించారు. బయోఫోర్, లూపిన్, ఇండియా బుల్స్ నుండి రూ.కోటి విలువైన మందులందాయని తెలిపారు. జిల్లాలోని ఏరియా ఆసుపత్రిలో ఒకటి చొప్పున 13*10 ఐసియు బెడ్లను నిర్మాణ్ సంస్థ అందజేస్తోందని తెలిపారు. ఫేజ్ 2లో మరో 13 నిర్మాణ్ సంస్థ సమకూర్చనుందని వివరించారు. ఆరు జిల్లాలోని ఏరియా ఆసుపత్రులలో 500 ఎల్పిఎం ఆక్సిజన్ ప్లాంట్ ను యాక్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోందన్నారు.

607 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 184 ఆక్సీ సిలెండర్లూ పలు సంస్థలు అందించాయని తెలిపారు. మరో వెయ్యికి పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించనున్నారని వివరించారు. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు సాయాన్ని అందిస్తున్నారని చెప్పారు. దేశంలోనూ , ఇతర దేశాల నుంచి సాయం అందించేందుకు సంస్థలు, వ్యక్తులు ముందుకొస్తున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement