Monday, April 29, 2024

భామిని మండలంలో పులి సంచారం – ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

కొత్తూరు (భామిని):ఆగష్టు 16:(ప్రభ న్యూస్):
మన్యం పార్వతీపురం జిల్లా భామిని మండల పరిధిలో ఉన్న కొరమ, చిన్నదిమిలి(కాట్రగాఢ) పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు బుధవారం గుర్తించారు .ఆయా గ్రామాలకు చెందిన కొందరు రైతులు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పెద్ద పులి పాదముద్రలు ఉన్నట్లు కొరమ, చిన్నదిమిలి(కాట్రగాడ)ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు పరిశీలించి గుర్తించారు. అటవీ శాఖ అధికారులు గుర్తించిన పాద ముద్రికలు పెద్ద పులికి సంభందించవేనని అటవీ శాఖ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు.

కొరమ, చిన్నదిమిలి(కాట్రగడ), పెద్దదిమిలి, కొత్తూరు మండలంలోని కర్లెమ్మ, బడిగాం, సీతంపేట మండలంలోని చిన్నబగ్గా, తదితర ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు, రైతులు, గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని ఆయా గ్రామాల గ్రామ రెవెన్యూ అధికారులకు తెలియజేసి గ్రామాల్లో దండోరా వేయించి అప్రమత్తం చేసే చర్యలు చేపట్టినట్లు కొత్తూరు అటవీ శాఖ సెక్షన్ అధికారులు, ఫారెస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు

సీతంపేట ఏజెన్సీ ప్రాంతమైన దోనుబాయ్ అటవీ ప్రాంతంలో కూడా పెద్ద పులులు సంచరిస్తున్నాయని ఆ ప్రాంతం నుండి ఇటువైపు గా దారితప్పి పెద్ద పులి వచ్చి ఉండవచ్చునని అటవీ శాఖ అధికారి ఒకరు తన అభిప్రాయం తెలిపారు.దీంతో స్థానిక ప్రజలను వి ఆర్వో వినోద్, ఫారెస్ట్, పోలీసు సిబ్బంది అలర్ట్ చేశారు. ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారులు పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement