Saturday, May 4, 2024

గణపవరంలో వి‌షాదం – గణపతి నిమజ్జనంలో… ముగ్గురు దుర్మరణం

నాదెండ్ల/ చిలకలూరిపేట ( ప్రభ న్యూస్) సెప్టెంబర్ 26 : ఓ నిరుపేద కార్మికుడు తన ఇంటిలో భక్థి శ్రద్ధలతో బుల్లి గణపతిని ప్రతిష్టించి.. కడక అడ్డfddd దాదా

చిలకలూరిపేట రూరల్ ఎస్సై రాజేష్ కథనం ప్రకారం, మధ్యప్రదేశ్ కు చెందిన ముఖేష్ (37) గణపవరంలోని ఒక స్పిన్నింగ్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, ముఖేష్ తన ఇంటి గదిలో చిన్ని గణపతి విగ్రహం ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. మధ్యప్రదేశ్ లో ముఖేష్ బంధువు మృతి చెందటంతో విగ్రహాన్ని తాకరాదని అదే కంపెనీలో నివసించే శ్రీకాకుళానికి చెందిన, కోన వసంత కుమార్ (18), ప్రకాశం జిల్లా కు చెందిన భాగ్యం ప్రవీణ్ కుమార్ రాజ్ (19), ఇరువురిని నిమజ్జనం

ముఖేష్ సహాయం అడిగాడు ముగ్గురు కలిసి సోమవారం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత మిల్లు నుంచి విగ్రహాన్ని సైకిల్ పై పెట్టుకుని గణపవరం నుంచి చిలకలూరిపేట మండలం ఏలూరు డొంకలోని ఏలూరు చెరువు వద్దకు వెళ్లి …. సైకిల్ ను చెరువు కట్ట పై పెట్టి, సెల్ ఫోన్, చెప్పులు పెట్టి ముగ్గురు కలిసి విగ్రహాన్ని తీసుకొని చెరువులోకి దిగారు.

, విగ్రహంతో పాటే ముగ్గురు చెరువులో పడి నీటిలో గల్లంతయ్యారు. ముగ్గురు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మిల్లు కార్మికులు వెతుక్కుంటూ చెరువు వద్దకు వెళ్లారు. చెరువు కట్టపై సైకిల్, చెప్పులు, ఫోన్లు ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మిల్లు కార్మికులు, ఈతగాళ్లు వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా ప్రవీణ్ రాజ్, మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీశారు. రాత్రి కావడంతో గాలింపు ఆపేసి మంగళవారం ఉదయం చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా, ఉదయం వసంత కుమార్ మృతదేహాన్ని వెలికి తీయగా మధ్యాహ్నం సమయంలో ముఖేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. ప్రవీణ్ రాజ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రూరల్ సీఐ వై అచ్చయ్య ఆధ్వర్యంలో మృతదేహాలను ఆటోలో పోస్టుమార్టం కొరకు చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

- Advertisement -

ముఖేష్ కి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముఖే‌ష్ భార్య పిల్లలను వదిలేసి మధ్యప్రదేశ్ లో ఉంటోంది. ప్రవీణ్ రాజ్ మిల్లులో పనిచేస్తుండగా వసంత కుమార్ ఐటిఐ చదువుతున్నాడు. ఈముగ్గురు మృతి తో మిల్లులో పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement