Monday, April 29, 2024

ప్రీ పబ్లిక్ పేపర్ ఇదే.. పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీక్?

మనుబోలు (ప్రభన్యూస్) : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష ప్ర‌శ్నా ప‌త్రాలు లీక‌య్యాయి. ప్రీ ప‌బ్లిక్ పేప‌ర్ ఇదేనంటూ వాట్సాప్‌లో క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇది విద్యార్థులను ఆందోళనకి గురిచేస్తోంది. సోషల్ మీడియాలోవచ్చిన హిందీ పేపర్ లోని ప్రశ్నలు ఎగ్జామ్‌లో రావడంతో.. ఇంగ్లిషు, లెక్కల క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు కూడా ఇవే కావడంతో మరింతగా ఆందోళన చెందుతున్నారు. ఒకరోజు ముందుగానే పేపర్లు నెట్ లో ప్రత్యక్షమ‌వుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పక్సందీగా పరీక్షలు నిర్వహిస్తున్నా ప్రశ్నపత్రాలు ఎలా బయటకి వస్తున్నాయ‌ని ఉపాధ్యాయులే అవాక్కు అవ్వుతున్నారు.

సోషల్ మీడియాలో వచ్చే ఈ పేపర్ ని ఇచ్చి మనుబోలు లోని ఓ కోచింగ్ సెంటర్ లో తర్ఫీదు చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా పాఠశాల ఉపాధ్యాయులు ఎవరు దీని గురించి పట్టించుకోకపోవడం విశేషం. ప్రీ పబ్లిక్ లో వచ్చే మార్కులు ఉత్తీర్ణతకి ఉపయోగ పడకపోయిన వాటి ఆధారంగానే విద్యార్థి సామర్థ్యాని అంచనా వేసి పబ్లిక్ పరీక్షల కోసం మరింతగా శ్రమించేందుకు కృషి చేయవచ్చు. అధికారుల నిర్లక్ష్యం కార‌ణంగా ప్రశ్నాపత్రాలు నెట్లో లీక్ అవుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement