Sunday, April 28, 2024

TTD: శ్రీవారికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు.. ఈఓ ధర్మారెడ్డి

తిరుమల : శ్రీవారికి ఈ యేడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 14 నుండి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. శాంతి భద్రతా చర్యలు నిర్వహణ పూర్తి భాద్యత తిరుపతి ఎస్పీ పరిధిలో ఉంటుందన్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతుందన్నారు. భక్తులు వేచి ఉండేందుకు వివిధ ప్రాంతాల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

గరుడసేవ రోజు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు అన్ని వెసులుబాటు దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేయడం జరుగుతుందన్నారు. 9రోజులు 24 గంటల పాటు తిరుమల-తిరుపతి మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉంటాయన్నారు. ఉదయం 8నుండి 10 గంటలకు, రాత్రి 7నుండి‌ 9 గంటల మధ్య స్వామివారి వాహనసేవలు ఉంటాయన్నారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో పోలీసు సెక్యూరిటీ చెక్ పోస్ట్ లుంటాయన్నారు. సెప్టెంబర్ 18న సీఎం చేతుల మీదుగా తిరుపతిలో శ్రీనివాససేతు ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రాంత ప్రజలకు బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు వెయ్యిమందికి దర్శనం కల్పిస్తామన్నారు. క్రూరమృగాల సంచారం దృష్ట్యా నడకదారులు, ఘాట్ రోడ్లలో నిభందనలు కొనసాగుతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement