Thursday, May 2, 2024

తిరుమల నడకదారిలో కంచె ఏర్పాటు ఆలోచన – మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : తిరుమల నడకదారి లో చిరుత పులి సమస్య ను ఆధిగమించడానికి శాశ్వతంగా కంచె నిర్మించే విషయం పై ఆలోచిస్తున్నట్టు రాష్ట్ర అటవీ, విద్యుత్, గనుల, పర్యావరణ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన తిరుపతిలో నిర్మించిన వై ఎస్ ఆర్ పర్యావరణ భవన్ ను ప్రారంభించారు. ఆ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తిరుమల నడకదారిలో చిరుతపులుల దాడులు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. ఇటీవల చిరుత దాడిలో చిన్నారి మరణించడం దురదృష్టకర సంఘటన గా పేర్కొంటూ మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తరపున 5 లక్షలు ఎక్స్ గ్రేసియ అందించామని చెప్పారు..

చిరుత దాడి సమస్య విషయం లో ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో టిటిడి కు సహకరిస్తామని , ఎక్కడా కూడా సిబ్బంది కొరత లేదనీ , అవసరమైన మేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఇప్పటి వరకు దొరికిన రెండు చిరుతలను ప్రస్తుతానికి జూ పార్క్ లోనే ఉంచుతామన్నారు. నడకదారిలో శాశ్వత ప్రాతపదికన కంచే ఏర్పాటు చేసే దిశగా టిటిడి, అటవీ శాఖ ఆలోచన చేస్తోందని, ఈ అంశం పై వచ్చే నిపుణుల నివేదిక ఆధారంగానే తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement