Thursday, April 25, 2024

Big Breaking | బీరు బాటిల్స్ లారీ బోల్తా.. ఎత్తుకెళ్లేందుకు ఎగ‌బ‌డ్డ జ‌నం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో బీరు బాటిల్స్‌తో వెళ్తున్న ఓ లారీ బోల్తా కొట్టింది. ఈ విష‌యం తెలిసిన చుట్టుప‌క్క‌ల వారు య‌మ స్పీడ్‌గా అక్క‌డికి చేరుకుని బాటిల్స్ ఎత్తుకెళ్లేందుకు ఎగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఇవ్వాల (సోమ‌వారం) జ‌ర‌గింది. జాతీయ రహదారిపై 200 బీరు కేసులతో వెళుతున్న వ్యాన్ కశింకోట మండలం బయ్యవరం వద్దకు రాగానే ప్రమాదానికి గుర‌య్యింది. దీంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడడంతో అందులోని బీరు కేసులన్నీ రోడ్డు పాలయ్యాయి.

బీరు వ్యాన్ రోడ్డుపై తిరగబడిందన్న సమాచారం కొన్ని నిమిషాల్లోనే ఆ ఏరియా అంత‌టా పాకిపోయింది. ఇక‌.. మందుబాబులు హుటాహుటీన అక్కడికి చేరుకుని అందిన కాడికి బీరు సీసాలు ఎత్తుకెళ్లారు. రోడ్డుపై పడడంతో కొన్ని పగిలిపోగా, మిగిలిన వాటికోసం చాలామంది పోటీపడ్డారు. వ్యాన్ బోల్తా నేపథ్యంలో ఆ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోగా, ప్రయాణికులు కూడా చేతికి అందినన్ని బీరు సీసాలు పట్టుకెళ్లారు. వ్యాన్ బోల్తాపడిన ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement