Thursday, May 2, 2024

Tension రాంగ్ రూట్ లో చంద్రబాబు హెలికాఫ్ట‌ర్…అరగంట పాటు ఆయోమ‌యం..

టీడీపీ అధినేత చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం రేగింది. ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో పైలట్‌కు సమన్వయ లోపం కారణంగా రాంగ్ రూట్‌లో ప్రయాణించింది. నిర్ధేశించిన మార్గంలో వెళ్లకుండా రాంగ్ రూట్‌లో వెళ్లడంతో ఏటీసీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో చంద్రబాబు హెలికాప్టర్ తప్పక వెనుదిగారగాల్సి వచ్చింది. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి ఇచ్చింది. విశాఖ నుంచి అరకు వెళ్తుండగా శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. అనంత‌రం ఆయ‌న అర‌కు చేరుకుని అక్క‌డ ఏర్పాటు చేసిన రా క‌దిలిరా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement