Saturday, December 7, 2024

ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం

కడపలోని రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో 4 యూనిట్లు ట్రిప్ అయ్యాయి. విద్యుత్ సరఫరాలో ఏర్పడిన సాంకేతిక లోపమే కారణమని అధికారులు చెబుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో విద్యుత్ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక్కొక్క యూనిట్ నుంచి 210 మెగా వాట్లు చొప్పున… 4 యూనిట్లలో 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణకు ఆర్టీపీపీ అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement