Saturday, May 4, 2024

TDP అధికారంలో రావడం ఖాయం – నారా భువనేశ్వరి

పెద్దకడబూరు, జనవరి 9, (ప్రభ న్యూస్ ): రాబోయే సార్వత్రిక ఎన్నికలలో టిడిపి అధికారంలో రావడం ఖాయమని నారా భువనేశ్వరి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన పెద్ద కడుబూరులో పర్యటిస్తున్న నారా భువనేశ్వరికి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, సిఐటియు నాయకులు కలసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ టిడిపి అధికారం చేపట్టిన తక్షణమే అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం దారుణం అన్నారు. అంగన్వాడీ లందరూ ఆత్మస్థైర్యంతో ఉండాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు చిట్టెమ్మ, రత్నమ్మ సిఐటియు నాయకులు తిక్కన్న, పరమేష్ ఆయా గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు,ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement