Sunday, March 26, 2023

టీడీపీ నేత దేవినేని ఉమా హౌస్ అరెస్ట్..

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామును దేవినేని ఉమా నివాసానికి భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. పోలీసులు ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో తెలియక పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. కుప్పం ఘటనపై ముందస్తుగా హౌస్ అరెస్ట్‌లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం స‌రికాదు…
రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునేందుకు ప్ర‌భుత్వం కుట్రప‌న్ని అడ్డుకుంటుంద‌ని దేవినేని ఉమా మండిప‌డ్డారు. కుప్పం పర్యటనను అడ్డుకోవడం వైసీసీ పిరికిపంద చర్య అని ట్విటర్ వేదికగా విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జి అమానుషమన్నారు. వైసీపీ పాల‌న‌లో ప్ర‌జా స్వామ్యం ఖూనీ అవుతుంద‌న్నారు. పరిపాలన చేతకాక దాడులు, దౌర్జన్యాలతో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గుణ‌పాటం చెబుతార‌న్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement