Sunday, April 28, 2024

TDP – Jana Sena – ఆ జాబితా ఫేక్.. అదంతా వ‌ట్టిదే!

ఏపీ రాజకీయాల్లో సంచలనం రేగింది. ఇటు పసుపు తమ్ముళ్లు, అటు జనసైనికులు ఎదురు చూస్తున్న పొత్తు జాబితా పేరిట,, ఫేక్ న్యూస్ కలకలం సృష్టించింది. . టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు కె.అచ్చెంనాయుడు పేరిట శుక్రవారం ఓ జాబితాను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ లేఖ సారాంశం ప్రకారం 2024లో తెలుగుదేశం 114 సీట్లు, జనసేన 61 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లేఖను విడుదల చేశారు. ఐతే, మరో పావుగంటలోనే ఆ లేఖ ఫేక్ అని టీడీపీ వివరిస్తూ తాజా లేఖను జారీ చేసింది. ఇప్పటికే సీట్లపై క్లారిటీ లేదని టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఎదురు చూస్తుండగా.. ఈ ఫేక్ జాబితా విడుదలతో ..టీడీపీ కంగుతినక తప్పలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement