Monday, December 11, 2023

TDP – జ‌గ‌న్ ది ఐరెన్ లెగ్…. ఎక్క‌డ కాలుపెట్టిన క‌ర‌వు కాట‌క‌మేః నారా లోకేష్ …

ఎపి ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ ఎక్కడుంటే కరవు అక్కడుంటుందని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.. ట్విట‌ర్ వేదిక‌గా ట్విట్ చేస్తూ. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు జగన్, కరవు కవల పిల్లలు అని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. వైఎస్ జగన్ విధానాలపై రైతులు విసుగెత్తిపోయారని త్వరలోనే జగన్ పని అయిపోతుందంటూ హెచ్చరించారు. ఐరన్ లెగ్ జగన్‌ను రాష్ట్రమంతా ద్వేషిస్తోందని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement