Sunday, April 28, 2024

TDP – ఆ హ‌త్య‌లే ప్ర‌భుత్వానివే…. జ‌గ‌న్ ను రాజీనామా చేయాల‌న్న చంద్ర‌బాబు ..

నల్లజర్ల: రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ తక్షణమే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. తండ్రి చనిపోతే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారని.. బాబాయ్‌ను చంపేసి మళ్లీ దండేసి సానుభూతి పొందారని వ్యాఖ్యానించారు. వైకాపా నేతలు శవరాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పింఛన్ల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టి వారికి తప్పుడు సమాచారం ఇవ్వడం దారుణమన్నారు. వాలంటీర్‌ వ్యవస్థను తామూ కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు.

ఓడిపోతామని తెలిసి 13 వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు విడుదల చేశారని మండిపడ్డారు. పింఛన్లు ఇవ్వాలంటే ముందుగా మనీ డ్రా చేసి పెట్టుకోవాలని, డోర్ డెలివరీ ఇవ్వొద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదన్నారు. వైసీపీ కుట్రలో అధికారులు భాగస్వామ్యులు కావడం దారుణమన్నారు. పింఛన్ల మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనన్నారు.

- Advertisement -

వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదన్నారు చంద్రబాబు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను బెదిరించడం దారుణమన్నారు. వాలంటీర్లను ఎన్నికల కోసం ఉపయోగించుకోవాలని వైసీపీ ప్లాన్ చేసిందన్న చంద్రబాబు.. ఆ వ్యవస్థను తాము కంటిన్యూ చేస్తామన్నారు. జగన్ గెలుపు కోసం వాలంటీర్లను బలిపశువు చేశారని దుయ్యబట్టారు. చివరకు వాలంటీర్లను రాజీనామా చేయాలని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొద్దిరోజులు ఆగితే ప్రతీ ఇంటికీ తాను పెద్ద కొడుకుగా ఉంటానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement