Friday, May 3, 2024

TDP – సూపర్‌ సిక్స్‌ ..సూపర్‌ హిట్‌ – చంద్ర బాబు

.కర్నూలు, ఏప్రిల్‌ 28, ప్రభ న్యూస్‌ బ్యూరో :రాష్ట్రంలో రాక్షస జగన్‌ పాలనను అంత మొందిద్దామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన మంత్రాలయం నియోజకవర్గం కౌతాళంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక్కసారి ఛాన్స్‌ పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్న్రి భ్రష్టు పట్టించారన్నారు.ఈ ఐదేళ్ల పాలనలో రాయలసీమకు చేసింది ఏమి లేదన్నారు. సీమలో 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేశారని విమర్శలు గుప్పించారు.

ముఖ్యంగా వలసలకు మారుపేరైన కర్నూలు జిల్లాకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసింది ఏం లేదన్నారు. హంద్రీనీవా, వేదవతి, ఆర్డీఎస్‌, గుండ్రేవుల వంటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. 2015 లోనే గుండ్రేవుల ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. కర్నూలు జిల్లాలో శాశ్వత సాగు,తాకినీటి పరిష్కారం కోసం ఆర్డీఎస్‌కు రూ.1955 కోట్లు-, వేదవతి ప్రాజెక్టు నిర్మాణంకు రూ. 1942 కోట్లు- కేటాయించామన్నారు. కానీ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు.

ఆర్డీఎస్‌ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. గురు రాఘవేంద్ర లిప్ట్‌n ఇరిగేషన్‌ పూర్తిగా నిర్లక్ష్యం చేశారున్నారు. ఫలితంగా మంత్రాలయం నియోజకవర్గం నుంచే దాదాపు 80 వేల మంది వలసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.తుంగభద్ర పక్కనే ఉన్నా మంత్రాలయం,కర్నూలు నియోజకవర్గాలకు కనీసం తాగు నీళ్లు ఇవ్వలేని స్ధితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. మంత్రాలయ అభివృద్ధికి టిడిపి ప్రభుత్వమే రూ. 8 కోట్లు- ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే మంత్రాలయం రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు.

- Advertisement -

కూటమి వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఉరుకుంద, ఈరన్న స్వామి ఆశీస్సులు టిడిపికే ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో మంత్రాలయానికి అన్నీ మంచి రోజులే వస్తాయని చెప్పారు.జగన్‌ ఐదేళ్ల పాలనలో ప్రజల జీవితాల్లో కొంతయైన మార్పుతెచ్చారా అని ప్రశ్నించారు. సైకో జగన్‌ రాయలసీమకు ఓక్క పనైనా చేశారా అని నిలదీశారు.

నీటి విలువ తెలియకపోవడం వల్లే రాయలసీమలోని కర్నూలు జిల్లాలో వలసలు అధికమైనట్లు- పేర్కొన్నారు. నవరత్నాల పేరిట నవ మోసాలు చేసిన జగన్ ప్రస్తుతం ప్రకటించిన మేనిఫెస్టో కొత్త సీసాలో జగన్‌ జే బ్రాండ్ల ఉందన్నారు. అందుకే జగన్‌ మేనిఫెస్టోకు జనం జీరో మార్కులు ఇస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. టిడిపి సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అయిందన్నారు.

.ప్రభుత్వం పంపిణీ చేసే జే బ్రాండ్‌ మద్యం తాగలేక ఇక్కడ ప్రజలు పొరుగున కర్ణాటకు వెళ్తున్నారన్నారు. నాసిరక మద్యం తాగి ఎందరో ఆడబిడ్డల తాళిబొట్లను జగన్‌ తెంపుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులకు జగన్‌ ఉద్యోగాలు ఇచ్చింది లేదన్నారు. జే బ్రాండ్‌ గంజాయి వంటివి సరఫరా చేసి యువతను నిర్విరం చేశారన్నారు. వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఏమైనా హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రి అవ్వగానే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తానన్నారు.

మెగా డీఎస్సీ నిర్వహాణ మీదనే తొలి సంతకం చేస్తానన్నారు. యువకులకు పోలీసులు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో రోడ్ల అధ్వానంగా ఉన్నాయని వాటిని మరమ్మత్తులు చేయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత ఏడు సార్లు కరెంటు- బిల్లులు పెంచిన విషయానికి గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే కరెంట్‌ బిల్లులు పెంచేది లేదన్నారు. నాణ్యమైన కరెంటు- ఇస్తానని హామీ ఇచ్చారు.

జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ మోసకారుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ లాంటి దుర్మార్గులు ఉంటే పిల్లల భవిష్యత్తు అంధకారమని మండిపడ్డారు. ప్రజల కోసమే పొత్తులు పెట్టు-కున్నామని తెలిపారు. కూటమి సభలు కళకళలాడుతుంటే.. జగన్‌ సభలు వెలవెలబోతున్నాయన్నారు. జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చంద్రబాబు పేర్కొన్నారు.

గడిచిన ఐదేళ్లో రాష్ట్రంలోని వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయని ఆరోపించారు. టీ-డీపీ హయాంలోనే ముస్లింలకు రాష్ట్రంలో ఎంతో మేలు జరిగింద న్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం మరో రెండు వారాల్లో తెరమరుగు కానుందని చంద్రబాబు జోష్యం చెప్పారు.

అన్నదమ్ములు దోచుకుంటున్నారు :మంత్రాలయం నియోజకవర్గం టిడిపి అభ్యర్థి రాగవేంద్రరెడ్డి, బోయ కులస్తుడు ఎంపీతో పాటు, ఆదోనికి డెంటల్‌ డాక్టర్‌ పార్థసారథి బోయ కులస్తుడు, ఆలూరు నియోజకవర్గానికి బలిజ సంఘం అభ్యర్థి, కోడుమూరు నియోజకవర్గానికి మాదిగ కులస్తుడు, కర్నూలుకు వైశ్య అభ్యర్థి, నంద్యాలకు ముస్లిం అభ్యర్థి ఇది నిజమైన సామాజిక న్యాయ పార్టీ కాదా అని అడుగుతున్నా వైసీపీలో ఇక్కడ ముగ్గురు రెడ్లు ఉన్నారు. ఇందులో ఇద్దరు అన్నదమ్ముల ఆదోనిఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి, మంత్రాలయంఎమ్మెల్యేవై బాలనాగి రెడ్డి ఆదోని, మంత్రాలయంలో జంటగా దోచుకుంటు-న్నారన్నారు.

. ఓట్లు- మీవి దోపిడి వారిదా అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో కచ్చితంగా గెలుస్తామని సామాజిక న్యాయం కట్టబడి ఉందాం అన్నారు. తుంగభద్ర నదిలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. నదిలో ఇసుక మాత్రం తోడి అమ్మేస్తున్నారన్నారు. బడుగుల రక్తం తాగే బాలనాగిరెడ్డి జనసైనికులు అందర్నీ కలిసిపోయే సామాజిక న్యాయము ద్వార మంత్రాలయానికి మరోసారి అభివృద్ధి చేస్తామన్నారు.

రాష్ట్రంలో బాదుడే బాదుడు జరిగింది

.ఇచ్చింది 10 దోచిన100, దోచేస్తే 1000 రాష్ట్రంలో డబ్బు ఉంది అంటే సైకో దగ్గర మాత్రమేనని కరెంటు- చార్జీలు పెరిగాయి తొమ్మిది సార్లు 200 నుండి 1000 రూపాయలు పెరిగింది నేను వస్తే సుపరిపాలన వస్తుంది వెయ్యి రూపాయలు ఉండే ఇసుక 5వేలు అయింది.ఉద్యోగాలు లేవు మేనిఫెస్టో ప్రకారం నిరుద్యోగులకు 3వేలు, అందుకే సూపర్‌ సిక్స్‌ పథకాలు సూపర్‌ ఆడబిడ్డలకు మహాలక్ష్మి ద్వారా డ్వాక్రా సహాయం ప్రతి ఆడపడుచులకు నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డల అకౌంట్లో వేసే బాధ్యత నాది అన్నారు. తల్లికి వందనం రూ.15వేలు ఒకరు చదివితే, అదే ఇద్దరు చదివితే రూ.30 వేలు, నలుగురు చదివితే 60 వేలు ఇస్త్తామన్నారు. అందరి పిల్లలు చదివించే బాధ్యత నాది.. ఓట్లు- వేసే బాధ్యత మీది అన్నారు.

పేదల మహిళలకు వంట గ్యాస్‌ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు, ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఫ్రీగా ఉచితప్రయాణం కల్పిస్తామన్నారు. నేను డ్రైవర్‌గా ఉంటానన్నారు. మహిళలకు డ్వాక్రా రుణాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. 40 సంవత్సరాలు నన్ను ఆదరించారు. వ్యవసాయానికి ప్రతి రైతుకు ఏడాదికి 20 వేలు అన్నదాతకు ఇచ్చే బాధ్యత నాది,ఇల్లు లేని ప్రతి పేదవాడి స్థలం ఇచ్చి అక్కడే ఇల్లు నిర్మిస్తానన్నారు.

తాను వస్తే అందరికీ పించన్లు ఇస్తామన్నారు. కౌతాళంలో వంద పడకల హాస్పిటల్‌ ఏర్పాటు- చేస్తానని మీకు హామీ ఇచ్చారు. మే 13వ తేదీన సైకిల్‌ కి రెండు ఓట్లు- వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంత్రాలయం నియోజకవర్గం బిసి సామాజిక మీ బిడ్డ ఎన్‌. రాఘవేంద్ర రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.

ప్రజల్లో తిరుగుబాటు- మొదలైంది రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని సీఎం జగన్‌ ఇంటికి సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధమయ్యారన్నారు. ఈ సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనఎన్‌ రాఘవేంద్ర రెడ్డిని, టిడిపి ఎంపీ అభ్యర్థిని చంద్రబాబు ప్రజలకు పరిచయం చేశారు

. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కా రెడ్డి, ఎంఎల్‌ సి బిటి నాయుడు,బిజెపి రామకృష్ణ, బిజెపి విష్ణువర్ధన్‌ రెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బీటీ- లక్ష్మన్న,రమాకాంత్‌ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, రఘునాథ్‌ రెడ్డి, ముత్తు రెడ్డి, రామిరెడ్డి, ఉలిగయ్య, సురేష్‌ నాయుడు, జ్ఞానేష్‌, రాకేష్‌, బిజెపి జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement