Sunday, April 28, 2024

ఐపీఎల్ కు క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యం – ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో – ఆంధ్రప్రదేశ్ నుంచి ఐపీఎల్ కి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రణాళికల సిద్ధం చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ ఆర్ గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. మన ఆంధ్ర మన ఏపీఎల్ పేరిట ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్. గోపీనాథ్ రెడ్డి శనివారం విజయవాడ బందర్ రోడ్డులో టార్చ్ ను వెలిగించి అనంతరం జాతీయ జెండాను ఊపి 3 కే రన్ ను లాంఛనంగా ప్రారంభించారు. తర్వాత గోపీనాథ్ రెడ్డి భారత క్రికెట్ బోర్డ్ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజుతో కలిసి టార్చ్ ను తీసుకొని రన్ చేసి యువ క్రికెటర్లలో స్ఫూర్తిని నింపారు. అనంతరం రాష్ట్రం నుంచి అండర్ 19 దేశ జట్టుకు ఆడిన మహిళా క్రికెటర్ ఎండీ షబనం, అపెక్స్ కౌన్సిల్ మెంబర్ ఎన్.గీతకు టార్చ్ కు అందచేశారు. విజయవాడ బందర్ రోడ్డు లోని ఇందిరా గాంధీ స్టేడియం నుంచి ప్రారంభమైన 3 కే రన్ టెక్కల్ రోడ్డు మీదుగా సిద్ధార్థ కాలేజీ సర్కిల్ నుంచి తిరిగి ఇందిరా గాంధీ స్టేడియంకు చేరుకుంది. తర్వాత వారు టార్చ్ ను ఏసీఏ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఆర్. గోపీనాథ్ రెడ్డి కి అందచేశారు.

అనంతరం ఏసీఏ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఆర్. గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఏపీఎల్ సీజన్ -2 రన్ ను విజయవాడలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ఏడాది నిర్వహించిన ఏపీఎల్ సీజన్ -1కు బాగా ఆదరణ పెరిగింది. ఈ ఏడాది ఏపీఎల్ సీజన్ – 2ను పెద్ద ఎత్తున నిర్వహించాలన్న లక్ష్యంతో ‘మన ఆంధ్ర మన ఏపీఎల్ రన్ ను ప్రారంభించాం అన్నారు. క్రికెట్ అభిమా నులు బాగా ఆదరించాలన్నారు.ఈ నెల 16వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు వైజాగ్ లోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 16 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు ఏపీఎల్ – 2 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఎల్ లో 120 మంది ఆంధ్ర యువ క్రికెటర్లు పాల్గొంటున్నారని వెల్లడించారు

. రాష్ట్రంలోనే ఇది అతిపెద్ద ఈవెంట్ అన్నారు. రాష్ట్రంలో ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఏసీఏ అధ్యక్షులు పి. శరత్ చంద్రారెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆయన నాయక త్వంలో మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఐపీఎల్ వేలం పాట నిర్వహించే చారుశర్మ ను తీసుకొచ్చి మన క్రికెటర్లకు కూడా వేలంపాట నిర్వహించామని తెలిపారు. యువ క్రికెటర్లలో ఉన్న ప్రతిభను గుర్తించడంతో పాటు ఆర్థికంగా ఐపీఎల్ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. రాష్ట్ర క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడే అవకాశం రావాలన్నదే తమ లక్ష్యం అన్నా రు.

Advertisement

తాజా వార్తలు

Advertisement