Sunday, April 28, 2024

AP: విద్యార్ధులు ఆవేశ నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్దు..

ఫ‌లితాల నేప‌థ్యంలో బోర్డు హిత‌వు
సప్లిమెంట‌రీలో మంచి ఫ‌లితాలు సాధించండి…
పిల్ల‌ల‌ను ఏమీ అనోద్దు…
వారిలో స్పూర్తిని నింపండి…

ఇంటర్‌ ఫలితాలను ప్రకటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్.. ఫెయిల్‌ అయ్యామని విద్యార్థుల బాధ పడొద్దు.. తొందరపాటు చర్యలకు పూనుకోవద్దు అని విజ్ఞప్తి చేశారు.. ఈ సారి కూడా బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర కంటే ఎక్కువగా ఉందన్న ఆయన.. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ తొందర పాటు చర్యలు వద్దు.. అంతేకాదు.. తల్లి తండ్రులు.. ఈ విషయంలో పిల్లలకు సపోర్ట్ చేయాలని సూచించారు..

ఫెయిల్‌ అయ్యారంటూ పిల్లలను అవమానించే విధంగా మాట్లాడొద్దన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి.. ఈసారి బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.. ఇక, మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ వెల్లడించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement