Saturday, May 4, 2024

Krishnaలో క‌డ‌లి క‌ల్లోలం.. రైతన్న‌ను ముంచిన తుఫాన్‌..జ‌న జీవ‌నం అస్త‌వ్య‌స్థం

(ప్రభ న్యూస్ బ్యూరో – కృష్ణా) బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను ప్రభావంతో కృష్ణాజిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతానికి చెన్నైకి 80 కి.మీ, నెల్లూరుకు 80 కి.మీ, బాపట్లకు 80 కి.మీ, మచిలీపట్నానికి 140కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తుఫాన్ గంటకు 14 కి.మీ వేగంతో కదులుతుంది. ఈరోజు మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటి అవకాశం ఉంది.

కృష్ణాజిల్లాలో 24 గంటలలో 121.32 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదయింది. తీరం వెంబడి గంటకు 90-100 కీమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. తీర ప్రాంత గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. 24 గంటలు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు గాను సముద్ర తీర ప్రాంత మండలాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో విద్యాసంస్థల సెలవు ప్రకటించాయి. పౌర జీవనం స్తంభించింది. ప్రధాన రహదారుల నిర్మానుషంగా మారాయి. పురాతన ఇల్లు అక్కడక్కడ దెబ్బ తిన్నాయి.

- Advertisement -

భారీ వృక్షాలు నేలకొరిగాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైతన్నను నట్టేట ముంచిన తుఫాను మిచౌంగ్ తుఫాన్ కారణంగా కురుష్ కురిసిన భారీ వర్షాల వల్ల రైతన్న నట్టేట మునిగాడు. కృష్ణాజిల్లాలో పాతికవేలు ఎకరాలు నీట మునిగాయి. నీట మునిగిన పంట చూసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. సాగునీరు అందక ఆయిల్ ఇంజిన్ లతో రైతులు ఆరుగాలం పాటు కష్టపడిన పంట చేతికి వచ్చే సమయంలో ఇంటికి చేర్చుకునే సమయంలో నీటి పాలయింది వరిపంట పడిపోయి నీట మునగటంతో ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో రైతులు అన్నారు.

తుఫాన్ ప్రభావం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో , వర్షపు నీరు ఉధృతికి డ్రైనేజీలు లాగక ఎదురు తన్ని పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయిఇప్పటికే కోతలు కోసి పనల మీద ఉన్న వరి పంట, కల్లాలపై రాసులుగా పోసిన ధాన్యం తడిచిపోయాయి. ఆన్లైన్ చేసిన ధాన్యం మిల్లులకు తరలించేందుకు వాహనాలు కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. మరోవైపు మిల్లులకు తరలించిన ధాన్యాన్ని, లారీల నుంచి దిగుమతి చేసుకోవడానికి మిల్లుల యజమానులు నిరాకరిస్తున్నారు.

దీంతో లారీ డ్రైవర్లు, రైతులు తమ ధాన్యాన్ని ఎప్పుడు దిగుమతి చేస్తారని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. తుఫాను ఫలితంగా రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. ధాన్యం తరలించేందుకు అధికారుల ప్రయత్నాలు చేస్తున్న మిల్లర్ల సహాయ నిరాకరణ కొంతమేర ఇబ్బందిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement