Tuesday, February 20, 2024

Chandrababu : సీఐడీ పీటీ వారెంట్లను తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు..

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు భారీ ఊరటనిచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబును విచారించేందుకు సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సమయంలోనే సీఐడీ పీటీ వారెంట్లు దాఖలు చేసింది. ఈరోజు ఈ పిటిషన్లను విచారించిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబు ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారని… అందువల్ల పీటీ వారెంట్లకు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement