Saturday, May 18, 2024

Srikakualm – చంద్ర‌బాబు అరెస్ట్ ను నిర‌సిస్తూ టిడిపి జ‌ల‌దీక్ష‌..

శ్రీకాకుళం, సెప్టెంబర్ 26:జాతీయ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీ‌కాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆమదాలవలస నియోజ‌క‌వవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదేశం మేరకు జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని.సుజాత ఆధ్వర్యంలో టిడిపి, జనసేన పార్టీలు కలిసి దూసిపేట గ్రామ నాగావళి నది లో జల దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఆమదాలవలస మండల టిడిపి నాయకులు తమ్మినేని అమర్నాథ్, తమ్మినేని అప్పలనాయుడు, కంచరాన లోకేశ్వరారావు,దుప్పల రమణ చిగురుపల్లి.కోటినాయుడు టిడిపి కార్యకర్తలు, జనసేన నాయకులు వీరగొట్టపు బాల మురళి,మురపాక రాజశేఖర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement