Friday, May 10, 2024

వైసిపి తీర్ధం పుచ్చుకున్న శాంతిరామ్ విద్యా సంస్థల అధినేత

తాడేపల్లి : రాయలసీమ జిల్లాల్లో అతిపెద్ద విద్యా సంస్థలకు అధినేత డాక్టర్ ఎం శాంతి రాముడు.. రాజకీయ అరంగేట్రం చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువాను కప్పుకొన్నారు. తన కుమారుడు శివరామ్‌తో కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.శాంతిరామ్ మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్, ఇతర విద్యా సంస్థల గ్రూప్‌ను స్థాపించారు శాంతి రాముడు. నంద్యాల కేంద్రంగా ఆయా విద్యా సంస్థలన్నీ తన కార్యకలాపాలను కొనసాగిస్తోన్నాయి. శాంతిరామ్ ఆసుపత్రిని నెలకొల్పారు. రాయలసీమవాసులకు అందుబాటులో ఉన్న అతిపెద్ద వైద్య కళాశాల, ఆసుపత్రుల్లో ఇదీ ఒకటి.

శాంతి రాముడు రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో విస్తృతంగా సాగుతోంది. దీన్ని నిజం చేశారాయన. ఈ సాయంత్రం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. తన కుమారుడు శివరామ్‌తో కలిసి వైసీపీలో జాయిన్ అయ్యారు. వారికి కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్.ఈ సందర్భంగా వారి వెంట నంద్యాల లోక్‌సభ సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి, జమ్మమడుగుకు చెందిన శాసన మండలి సభ్యులు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, నంద్యాల, పాణ్యం శాసన సభ్యులు శిల్పా రవిచంద్రారెడ్డి, కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి.. ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు.ఈ సందర్భంగా పోచా బ్రహ్మానందరెడ్డి, ఇతర నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపించే సమయానికి ఇతర పార్టీలకు చెందిన నాయకులు సైతం భారీగా వైసీపీలో చేరబోతోన్నారని పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement