Monday, April 29, 2024

ఉక్రెయిన్ నుంచి క్షేమంగా ఏపీకి.. క‌ర్నూలుకు చేరిన వైద్య విద్యార్థిని సాయి స్కందన

కర్నూలు, ప్రభ న్యూస్ బ్యూరో : ఉక్రెయిన్ దేశంలో ఎంబిబిఎస్ చ‌దివేందుకు వెళ్ళిన ఆదోనికి చెందిన వల్లం కొండ సాయి స్కందన అక్కడ యుద్ధ పరిస్థితి నెలకొనడంతో భయాందోళనకు గురిఅయింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ కర్నూలు జిల్లా కలెక్టర్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కి తమ కూతురు ని ఉపయోగించి క్షేమంగా తీసుకురావాలనీ మొరపెట్టుకున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్రెయిన్ దేశము నుంచి స్వదేశానికి క్షేమంగా తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన వల్లం కొండ సాయి స్కందన ఉక్రెయిన్ దేశం నుండి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి క్షేమంగా చేరుకొంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వల్లం కొండ సాయి స్కందనను కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆదేశాల మేరకు డిఆర్ఓ పుల్లయ్య, ఆదోని ఆర్ డిఓ రామకృష్ణ రెడ్డి సూచించిన ప్రకారం విద్యార్థిని వల్లం కొండ సాయి స్కందనకు పుష్పగుచ్చం అందజేసి పత్తికొండ తహసీల్దార్ ఘనంగా స్వాగతం పలికారు.

ఎంబిబిఎస్ చదువుతున్నా వల్లం కొండ సాయి స్కందన మాట్లాడుతూ….ఉక్రెయిన్ దేశంలో నెలకొన్న యుద్ధ భయానక పరిస్థితులలో తమకు ఎంతో ధైర్యం చెప్పి, తమను క్షేమంగా ఢిల్లీ, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి, స్వస్థలాలకు క్షేమంగా చేర్చినందుకు ఇండియన్ ఎంబసీకి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. స్వదేశానికి చేరుకోవడం, అక్కడ నుండి రాష్ట్రానికి స్వస్థలాలకు క్షేమంగా చేరుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించి వెన్నంటే ఉండి తమరు క్షేమంగా చేర్చంది అన్నారు. వల్లం కొండ సాయి స్కందన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ…. మా అమ్మాయిని క్షేమంగా దగ్గరికి చేర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, డిఆర్ ఓ పుల్లయ్య, ఆదోని ఆర్ డిఓ రామకృష్ణ రెడ్డి, జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement