Friday, October 4, 2024

AP | వైసీపీ హ‌యాంలో, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమే: ఎంపీ మిథున్ రెడ్డి

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్): వైఎస్ఆర్సిపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి.. గత తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి గురించి తాము చర్చకు సిద్ధమేనని ఎంపీ మిధున్ రెడ్డి అన్నారు. బుధవారం ఎంఆర్ పల్లిలోని మారుతి నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కొన్ని రోజులుగా చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రలో ఎదుటి వారిని తిట్టడానికే మాట్లాడుతున్నారన్నారు. ఇంతకీ పాదయాత్ర ప్రజలకు ఏం మేలు చేస్తారో తెలపాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుండి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు.

ప్రధానంగా జిల్లాల్లో తంబళ్లపల్లి వెనుకబడిన నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. లోకేష్ కు హైదరాబాదులో ఉంటే.. చిత్తూరు జిల్లా గురించి ఏమి తెలియదన్నారు. 1996 నుండి చిత్తూరు జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించలేదని గుర్తు చేశారు. పుంగునూరు నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల క్రితం ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 500 కిలోమీటర్లు రోడ్లు వేయడం జరిగిందని గుర్తు చేశారు. తాము చేసిన అభివృద్ధి దగ్గరికి వెళ్లి లోకేష్ చూసి సెల్ఫీ ఫోటోలు తీసుకోవాలని తెలియజేశారు. మదనపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు ఆ ప్రాంతంలో కూడా రిజర్వాయర్ ప్రాజెక్టులను కూడా ఇటీవల కాలంలో పనులు సర్వేకంగా సాగుతున్నాయి అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద చల్లాలని చూస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement