Friday, July 26, 2024

Spl Story | కొవిడ్​ సోకిన వారిలో జీర్ణకోశ సమస్యలు.. వైద్య పరిశోధనల్లో ఏం తేలిందంటే!

కొవిడ్​ మహమ్మారి ఉధృతి తగ్గినా.. దాని ప్రభావం ప్రజలపై ఇంకా పోలేదు. కరోనా సోకి కోలుకున్న వారిలో ఇప్పుడిప్పుడే ఇన్​ఫెక్షన్లు బయటపడుతున్నాయి. దీనిపై అధ్యయనం చేసిన పరిశోధకులు ఈ విషయాన్ని స్పష్ట చేస్తున్నారు. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించిన పలు విషయాలు ఇప్పుడు భయపెట్టేలా ఉన్నాయి. పరిశోధకులు సుమారు కోటి 40 లక్షల వైద్య రికార్డులను విశ్లేషించి పలు విషయాలను బహిర్గతం చేశారు.  

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

2019లో మొదలై రెండేళ్లపాటు యావత్​ ప్రపంచ మానవాళిని గడగడలాడించిన కరోనా మహమ్మారి.. ఇప్పుడు ప్రజలను మరో రకంగా భయాందోళనకు గురిచేస్తోంది. కరోనా టీకా అందుబాటులోకి రావడం.. వైరస్​ పలు రకాలుగా రూపాంతరం చెంది కాస్త నెమ్మదించడంతో జనాలు ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు ఏడాది కాలంగా లైఫ్​ అంతా నార్మల్​ అయిపోయింది. వ్యాపారాలు జోరందుకున్నాయి. ప్రజా సమూహం ఎప్పటిమాదిరిగానే బయట గుంపులు గుంపులుగా తిరుగుతోంది. ఇక ఇబ్బందేమీ లేదన్న విధంగా జనం సాధారణ జీవితం గడపుతున్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో కొన్ని వరుస ఇన్సిడెంట్స్​ జనాలను భయపెడుతున్నాయి. చాలామంది యువతీ, యువకులు, నడి వయస్సు వారు హటాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. దీనికి ప్రధానంగా హార్ట్​ ఎటాక్​ కారణంగా డాక్టర్లు చెబుతున్నారు. అయితే.. ఇట్లా రావడానికి కారణాలను కూడా వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా సమయంలో ఎదుర్కొన్న ఇన్​ఫెక్లన్లు, టీకాల ప్రభావమే హార్ట్​ ఎటాక్​కి కారణమవుతుందా అనేది కూడా కొంత సంశయాత్మకంగా ఉంది.

ఈ క్రమంలో వైద్య పరిశోధకులు చేసిన పరిశోధనల్లో మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొవిడ్-సోకిన వ్యక్తుల్లో ఒక సంవత్సరంలోపే కాలేయ సమస్యలు, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, యాసిడ్ రిఫ్లక్స్.. అల్సర్ వంటి గ్యాస్ట్రోఇంటెస్టినల్ (జిఐ) డిజార్డర్‌లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు ఈ వైద్య పరిశోధనల్లో వెల్లడయ్యింది.

- Advertisement -

ఇక.. మలబద్ధకం, విరేచనాలు, పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం.. వాంతుల వంటి అనారోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.   పేషెంట్ కమ్యూనిటీ ద్వారా వెలువడిని నివేదకల్లో మొదటి వాటిలో జీర్ణశయాంతర సమస్యలు ఉన్నాయి అని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో క్లినికల్ ఎపిడెమియాలజిస్ట్ సీనియర్ రచయిత జియాద్ అల్-అలీ చెప్పారు. GI ట్రాక్ట్ వైరస్ అనేది.. ఒక రిజర్వాయర్‌గా పనిచేస్తుందని స్పష్టంగా తెలుస్తోందని వెల్లడించారు.

జీర్ణశయాంతర వ్యవస్థలో నోరు, గొంతు, అన్నవాహిక, కడుపు, చిన్న, పెద్ద ప్రేగులు, పురీషనాళం.. పాయువు, అలాగే కాలేయం.. ప్యాంక్రియాస్ వంటి అవయవాలు.. ఆహారం, ద్రవాల జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. వైరస్ బారిన పడని వారితో పోలిస్తే కొవిడ్ -19 ఉన్నవారిలో GI రుగ్మతలు 36 శాతం ఎక్కువగా ఉన్నాయని వారు కనుగొన్నారు. వైరస్ కారణంగా ఆసుపత్రిలో చేరిన, చేరని వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు.

ఇంకా.. కొవిడ్ ఉన్న వ్యక్తులు కూడా 62 శాతం పొట్ట లేదా చిన్న ప్రేగు యొక్క లైనింగ్‌లో పుండ్లు వచ్చే ప్రమాదం ఉంది. యాసిడ్ రిఫ్లక్స్ వ్యాధితో బాధపడుతున్న 35 శాతం మందికి అధిక ప్రమాదం ఉంది.. తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్‌ను ఎదుర్కొనే ప్రమాదం 46 శాతం పెరిగింది. కొవిడ్ రోగులు ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌తో బాధపడే అవకాశం 54 శాతం ఎక్కువ, కడుపు లైనింగ్‌లో మంటను అనుభవించే అవకాశం 47 శాతం ఎక్కువ. స్పష్టమైన కారణం లేకుండా కడుపు నొప్పి వచ్చే అవకాశం 36 శాతం ఎక్కువ ఉంటుందని వైద్య పరిశోధనల్లో వెల్లడయ్యింది.

అదేవిధంగా.. కొవిడ్ -19 ఉన్నవారు మలబద్ధకం, అతిసారం, ఉబ్బరం, వాంతులు, కడుపు నొప్పి వంటి జీర్ణ లక్షణాలను అనుభవించే అవకాశం 54 శాతం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఇప్పటివరకు, SARS-CoV-2 వల్ల కలిగే అంటువ్యాధులు ప్రపంచవ్యాప్తంగా 42 మిలియన్ల కొత్త కేసులకు దోహదపడ్డాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇది చిన్న సమస్య కాదు.. అంతకంటే చిన్న సంఖ్య కూడా కాదని అని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో క్లినికల్ ఎపిడెమియాలజిస్ట్ సీనియర్ రచయిత జియాద్ అల్-అలీ చెప్పారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement