Friday, May 31, 2024

రేపే నంద్యాల‌లో రాయ‌ల‌సీమ ధ‌ర్మ‌దీక్ష‌..

తిరుపతి, ప్రభన్యూస్‌ బ్యూరో (రాయలసీమ): రాష్ట్ర విభజన చట్టం 2014 ప్రకారం ఏర్పాటైన కృష్ణా రివర్‌ మేనేజ్‌ మెంట్‌ బోర్డు (కెఆర్‌ఎంబి) ఎక్కడ ఏర్పాటు చేయాలనే అం శం రాయలసీమవాసుల్లో చర్చనీయాంశమవుతోంది. సమై క్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవసరాలకు కృష్ణా జలాలను సమగ్రం గా అందించడానికి వీలుగా నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు రాయ లసీమ ప్రాంతంలోనే ఉండడం అత్యంత కీలకమవుతోంది. ఆ కీలకమైన ప్రాజెక్టు ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాం తంలో కాకుండా కృష్ణాజలాలకు సంబంధం లేని విశాఖపట్ట ణంలో కెఆర్‌ ఎంబి కార్యాలయం ఏర్పాటు చేయడమంటే ఆట ఒకచోట జరుగుతుంటే పర్యవేక్షించి, తీర్పులిచ్చే రెఫరీ మరో చోట ఉంచినట్టవుతుందని రాయలసీమవాదులు అంటున్నా రు. కనుక కెఆర్‌ ఎంబి కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేస్తున్న ఆందోళనల పరంపరంలో భాగంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 18న నంద్యాల జిల్లా కలెక్టరేట్‌ వద్ద భారీ ఎత్తున ధర్మదీక్ష నిర్వహించడానికి రంగం సిద్దమవుతోంది.


ఎగువన ఉన్న కర్నాటక రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రా లకు నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టుల గుండా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల మీదుగా సముద్రంలో కలుస్తాయ నే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తెలుగురాష్ట్రా ల్లో కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన అత్యంత కీల కమైన్‌ ప్రాజెక్టుగా శ్రీశైలం ప్రాజెక్టు గుర్తింపుపొందింది. మరో విధంగా ఇటు రాయలసీమ జిల్లాలే కాక అటు నెల్లూరు, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహబూబ్‌నగర్‌ జిల్లా ల నీటి అవసరాలను తీర్చడంలో, రెండు తెలుగు రాష్ట్రాలకు అవసరమైన జలవిద్యుత్‌ ఉత్పత్తిలో కూడా శ్రీశైలం ప్రాజెక్టు కీలకపా త్ర పోషిస్తోంది. అందుకే కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన వివాదాలపై గతంలో ఏర్పాటైన బచావత్‌ ట్రి బ్యునల్‌ కూడా నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు కేటాయించిన నీటి పరిమాణం మేరకే కృష్ణా జలాలను విద్యుత్‌ ఉత్పత్తికి విని యోగించాలని నిర్దేశించడంలో కూడా శ్రీశైలం ప్రాజెక్టు వ్యూ హాత్మక ప్రాజెక్టని పేర్కొన్నది.

అదే బచావత్‌ ట్రిబ్యునల్‌లోనే 264 టిఎంసిల నీటిని నాగార్జున సాగర్‌కు కేటాయిస్తూ మిగి లిన నీటిని ఇప్పటి 8 రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, మహ బూబ్‌ నగర్‌ జిల్లాలతో పాటు చెన్నై మహానగరానికి తాగునీ ళ్లను అందించే కార్యక్రమాన్ని కూడా నిర్దేశించింది. దీనికి కొనసాగింపుగానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనచట్టం 2014 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా లభించే కృష్ణా మిగులు జలాల ఆధారంగానే తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు అనుమతులు కూడా లభించాయి. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణాడెల్టా కు కేటాయించిన 80 టిఎంసిల నీటి అవసరాలను గోదావరి జలాల ద్వారా తీర్చుకునే అవకాశాన్ని పట్టిసీమప్రాజెక్టు తీరుస్తోంది. కనుక కృష్ణానదీపరీవాహక ప్రాంతాలైన రెండు తెలుగురాష్ట్రాల్లోని ఏడెనిమిది జిల్లాల తాగు,సాగు నీటి అవసరాలు తీర్చే కృష్ణా జలాల వినియోగంలో శ్రీశైలం ప్రాజెక్టు అత్యంత వ్యూహాత్మక మవుతోంది. మరో విశేషమేమిటంటే కెసి కాలువ, శ్రీశైలం కుడిగట్టు కాలువ, తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ద్వా రా రాయలసీమ ప్రాంతం చట్టబద్ధంగా లభించే కృష్ణాజలాల తో 19 లక్షల ఎకరాలసాగు కావాల్సివుండగా ప్రస్తుతం కేవలం 8 లక్షల ఎకరాల సాగు సాధ్యమవుతుండగా మిగిలిన నీళ్లు సముద్రం పాలవుతోంది.

ఇదిలావుండగా, రెండు తెలుగు రాష్ట్రాలకు భవిష్యత్తు లో ఎటువంటి సమస్యలు రాకుండా చూసేందుకే రాష్ట్ర విభ జన చట్టం 2014 కృష్ణా రివర్‌ మేనేజిమెంట్‌ బోర్డు కెఆర్‌ఎంబి అనే సాధికారవ్యవస్ధ రూపకల్పనకు నిర్దేశించింది. కారణా లేవైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ కెఆర్‌ఎం బోర్డును విశాఖపట్టణం లో ఏర్పాటు చేయాలని గత ఏడాది సిఫార్సు చేయడంతో వి వాదం మొదలైంది. మొత్తం కృష్ణాజలాల వినియోగానికి సం బంధించిన అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండగా, బో ర్డు ప్రధాన కార్యాలయాన్ని కృష్ణా జలాలతో సంబంధం లేని విశాఖపట్టణంలో ఏర్పాటు చేయడమేమిటని రాయలసీమ ఉద్యమవాదులు ప్రశ్నిస్తున్నారు. ఒకవిధంగా కృష్ణా జలాలకు సంబంధించిన వివాదమనే ఫుట్‌బాల్‌ ఆట రాయలసీ మలో జరుగుతుండగా, దగ్గరుండి పర్యవేక్షించాల్సిన రెఫరీ వంటి బోర్డు ఎక్కడో వైజాగ్‌లో ఉండడమేమిటని రాయల సీమవాదులు నిలదీస్తున్నారు. కెఆర్‌ఎం బోర్డును వైజాగ్‌లో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన తర్వాత నుంచి పలురకాల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి, అటు ముఖ్యమంత్రి కార్యాలయానికి, ఇటు బోర్డు ఛైర్మన్‌కు లేఖలు కూడా రాసిం ది.

- Advertisement -

వీరి డిమాండ్‌కు 2021 డిసెంబర్‌ 6న విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నవివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల, కృష్ణా జిల్లాకు చెందిన రైతు సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. శ్రీభాగ్‌ ఒడం బడికను అమలు చేయాలనే డిమాండ్‌తో 2022 డిసెంబర్‌ 5న కర్నూలులో నిర్వహించిన సీమ గర్జన సభలో పాల్గొన్న రా యలసీమ ప్రజాప్రతినిధులు పలువురు కర్నూలులో కృష్ణా బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను సమర్ధించారు. తమ వంతు ప్రయత్నంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని ప్రకటించారు.


ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఈ నెల 18న నం ద్యాల జిల్లా కలెక్టరేట్‌ వద్ద రాయలసీమ ధర్మదీక్ష పేరుతో భారీ ఎత్తున ప్రదర్శన ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి నిర్ణయించింది. కర్నూలులోని కృష్ణా బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో నిర్వహించే ఈ కార్యక్రమం లో అన్ని రాజకీయ పార్టీల, రైతుసంఘాల, ప్రజాసంఘాల ప్ర తినిధులు, రాయలసీమ నలుమూలల నుంచి రాయలసీమ వాదులు పాల్గొంటారని సమితి అధ్యక్షుడు దశరధరామిరెడ్డి తెలిపారు. కృష్ణా జలాలను వినియోగించుకునే రెండు తెలు గురాష్ట్రాలకు అందుబాటుగా ఉండే కర్నూలులోనే కృష్ణాబో ర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే తమ ధర్మదీక్ష ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement