Friday, April 26, 2024

ఆదాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి

లీజు ఒప్పందాలకూ రిజిస్ట్రేషన్‌
బాండ్‌ పేపర్‌పై ఒప్పందాలకు బ్రేకే

అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఆదాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎక్కడ ఆదాయం వస్తుందో
ప్రభుత్వం వెతికి వసూళ్లు చేయడం ప్రారంభించింది. ఇప్ప టికే వివిధ పన్నులు పెంచడంతో పాటు- ఏకమొత్తం పరిష్కా రమంటూ అప్పుడెప్పుడో నిర్మించుకున్న ఇళ్లకు ఓటీ-ఎస్‌ రూ పంలో లబ్ధిదారుల నుంచి రుసుము వసూలు చేస్తున్న విష యం తెలిసిందే. తాజాగా లీజు ఒప్పందాలకు కూడా రిజిస్ట్రేష న్‌ చేయించి నిర్దేశించిన రుసుము వసూలు చేయాలని ఆదే శాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాల రిజిస్ట్రేషన్‌శాఖలు కా ర్యాచరణ చేపట్టగా.. వివిధ వర్గాల ప్రజలు ఆందోళన చెందు తున్నారు. రాష్ట్రంలోని వివిధ పురపాలక సంఘ భవన సముదాయాలను అద్దెకు ఇస్తుంటారు. అలా అద్దెకు తీసుకునే వ్యక్తికి ఎన్ని సంవత్సరా లు అనేది ఒప్పందం చేసుకుని రిజిస్ట్రేష న్‌ చేయిస్తుంటారు. అలాంటి వాటికి నగర, పురపాలక సంఘాలు రిజిస్ట్రే షన్‌శాఖకు రుసుము చెల్లించాల్సి ఉంటు-ంది. ఈ నిబంధన ఎప్పటిను ంచో ఉన్నా ఎన్నో ఏళ్ల నుంచి వీటి గు రించి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు వాటిపై దృష్టి సా రించారు. జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఉన్న భవన సముదాయాల ద్వారా రిజిస్ట్రేషన్‌శాఖకు రావాల్సిన ఆదాయాన్ని వసూలు చేసేందుకు సిద్ధమయ్యా రు. తొలుత పట్టణాల్లో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. పంచాయతీల్లోనూ ఒప్పందాలపై వసూళ్లకు కార్యాచరణ చేపట్టారు.

బాండ్‌ పేపర్‌పై ఒప్పందాలకు బ్రేక్‌..
సాధారణంగా వ్యక్తిగతంగా ఇల్లు అద్దెకు తీసుకునే సమయంలో ఇంటి యజమాని, అద్దెకు తీసుకునే వ్యక్తి ఇరు వురూ ఎన్ని సంవత్సరాలు అనేది ఒప్పం దం చేసుకుంటారు. ఇళ్లు, స్థలాలు, భవనా లు ఇతర ఆస్తుల క్రయ, విక్రయాల సమయం లో ఇరుపక్షాలు బాండ్‌ పేపర్‌పై రాయించుకుంటారు. ఇకపై అలాంటి వాటిని కూడా రిజిస్ట్రేషన్‌ చేయించి నిర్థేశిత రు సుము వసూలు చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా చేపట్టే అభివృద్ధి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కూడా పనికి సంబంధించిన వివరాలతో రిజి స్ట్రేషన్‌ చేయించుకోవాలని, అలాంటి వారినుంచి కూడా రు సుం వసూలు చేయనున్నట్లు- అధికారులు చెబుతున్నారు. కు టు-ంబ అవసరాలు తీర్చుకోవడానికి చాలామంది ఆస్తులకు సంబంధించిన పత్రాలు సమర్పిస్తే బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు రుణాలు అందించేవి. ప్రస్తుతం వాటికి కూడా తనఖా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేశాయి.
ఇలాంటి తరుణంలో నమ్మకంతో కుదుర్చుకునే ఒప్పం దాల నుంచి కూడా డబ్బులు రాబట్టాలని చేస్తున్న ప్రయ త్నానికి పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిబంధ నల ప్రకారమే లీజ్‌ అగ్రిమెంట్‌లపై రుసుము వసూలు చేస్తు న్నామని రిజిస్ట్రేషన్‌ శాఖాధికారులు చెబుతున్నారు. ఒప్పం దాలు అన్నింటికి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించా రు. చాలామంది ఏదో పత్రాలమీద రాసుకుంటారని, ఏదైనా సమస్య ఏర్పడి ఇరుపక్షాలు కోర్టుకు వెళ్లాల్సి వస్తే ఒప్పందపత్రం చెల్లదన్నారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటేనే చట్టబద్ధత వస్తుందన్న అవగాహనతో అందరూ ముందుకు రావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement