Friday, April 26, 2024

కోలుకుంటోన్న విజ‌య్ ఆంటోని.. వెల్ల‌డించిన డాక్ట‌ర్స్

హీరో విజ‌య్ ఆంటోని క్షేమంగానే ఉన్నాడని, మేజర్‌గా దెబ్బలేవి తగడం లేదని చెప్పారు డాక్ట‌ర్లు. అంతేకాకుండా విజయ్‌ వేగంగా కోలుకుంటున్నాడని డాక్టర్‌లు తెలిపారు. విజయ్‌ తొందరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. విజయ్‌ ఆంటోని ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఏడు సినిమాలున్నాయి. కాగా ‘బిచ్చగాడు-2’ సినిమాకు దర్శకుడు కూడా విజయ్‌ అవడం విశేషం. తెలుగులో ప‌లు సినిమాల‌కు సంగీత ద‌ర్శకుడిగా ప‌నిచేసిన విజ‌య్ ఆంటోని.. ‘స‌లీమ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. ‘బిచ్చగాడు’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. బిచ్చ‌గాడు2 చిత్ర షూటింగ్ లో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ మలేషియాలో జరుగుతుంది. కాగా వాటర్‌ బోట్‌ సీన్‌ చిత్రీకరిస్తుండగా విజయ్‌ గాయపడ్డాడు. విజయ్‌ ప్రయాణిస్తున్న వాటర్‌ బోట్‌, కెమెరామెన్‌ సిబ్బింది ఉన్న పెద్ద పడవలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో విజయ్‌కు తీవ్రంగా గాయలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement