Tuesday, May 7, 2024

నాసా పోటీలకు రవీంద్రభారతి విద్యార్థులు

      

ఇచ్ఛాపురం: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ( నాసా ) నిర్వహించే పోటీలకు రవీంద్రభారతి విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు.  45 రోజులపాటు కసరత్తు చేసి తమ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టును ఆన్ లైన్ ద్వారా నాసా పోటీల్లో పాల్గొనేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ జి కె నాయుడు తెలిపారు. పాఠశాలలోని 8, 9 వ తరగతికి చెందిన 12 మంది విద్యార్థుల బృందం ” టెక్నిటోస్ ప్లానిటిస్ ” ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయని హేమలత మెంటర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 31 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. అమెరికా లోని అర్లింగ్టన్, వర్జీనియా లో 2022 వ సంవత్సరము మే నెల 27 నుండి 29 తేదీల వరకు జరిగే అంతర్జాతీయ  సమ్మేళనం లో ఈ ప్రాజెక్టు ను ప్రదర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. రవీంద్రభారతి విద్యాసంస్థల ఛైర్మన్ ఎం.యస్.మణి విద్యార్థులను ప్రోత్సహిస్తూ తమకు దిశానిర్దేశం చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ నాయుడు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement