Thursday, May 2, 2024

చ‌ల‌చ‌ల్ల‌ని వార్త – రాబోయే రెండు రోజుల‌లో తెలుగు రాష్ట్రాల‌లో వ‌ర్షాలు..

హైద‌రాబాద్ – తెలంగాణ‌లో గ‌త వారం రోజులుగా ఎండ‌లు మండిపోతున్నాయి.. కొన్ని ప్రాంతాల‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి.. ఈ ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భంగా మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణఇ ఆవరించి ఉందని పేర్కొంది. దీని ఫలితంగా దక్షిణ తెలంగాణలో అక్కకడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది


అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి తేమ గాలులు రాయలసీమ, కోస్తా జిల్లాల్లోకి వీస్తున్నాయని పేర్కొంది. ఈ ప్రభావంతో రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కోస్తాలోని జిల్లాలతో పాటూ రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement