Saturday, May 4, 2024

Rains – బంగాళ‌ఖాతంలో వాయుగుండం – ఎపిలో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు..

విశాఖ‌ప‌ట్నం – వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి అల్పపీడనం కాస్తా వాయుగుండంగా బలపడనుందని పేర్కొంది. దీని ప్రభావంతో 4 రోజుల పాటు ఉత్తరకోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు ఉత్తరకొస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడా పిడుగులు సంభవించవచ్చునని వాతావరణ అధికారులు తెలిపారు.

ఇక తెలంగాణలోనూ ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఆకాశం మేఘావృతం అయ్యి.. తెల్లవారుజామున నుంచి ఆగకుండా జల్లులు కురుస్తున్నాయి.. అలాగే అనేక జిల్లాల‌లో ఒక మోస్త‌రుగా వ‌ర్షం ప‌డుతున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement