Saturday, May 11, 2024

తిరుమ‌ల‌లో కుంభ‌వృష్టి – భ‌క్తుల‌కు ఇబ్బందులు

తిరుమల: తిరుమ‌ల‌లో నేడు భారీ వ‌ర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా మారి ఈదురుగాలులతో కూడిన వాన దంచి కొట్టింది.. భారీ వర్షం కారణంగా ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి.కాగా, ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన భ‌క్తుల క్యూ మూడు కిలోమీటర్ల మేర ఉంది.. వాన కార‌ణంగా క్యూ లైన్‌లోకి నీరు చేరడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అలాగే అనేక ప్రాంతాల‌లో మోకాలి లోతు నిల‌వ‌డంతో వాటిని తొలిగించే ప‌నిలో ప‌డ్డారు తిరుమ‌ల సిబ్బంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement