Friday, April 26, 2024

తాత్కాలికంగా ప్లాట్‌ ఫామ్‌ ధర పెంచిన రైల్వే..!

అమరావతి, ఆంధ్రప్రభ: దసరా సందర్భంగా రైల్వే స్టేషన్లలో ఏర్పడే రద్దీని దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా ఫ్లామ్‌పామ్‌ ధరను పెంచాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఫ్లాట్‌ ఫామ్‌ ధరను రూ. 10 నుండి 30 రూపాయలకు పెంచారు. గురువారం అర్ధరాత్రి నుండే అమల్లోకి వస్తుందని, వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు కొనసాగుతుందని విజయవాడ రైల్వే డివిజన్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లు

దసరా రద్దీని దృష్టిలో పెట్టుకొని 10 ప్రత్యే రైళ్లను నడపబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వచ్చే నెల ఒకటో తేదీ నుండి వచ్చే నెల 31వ తేదీ వరకు మొత్తం పది ట్రైన్లను సికింద్రాబాద్‌-దర్బంగా, సికింద్రాబాద్‌-హిస్సార్‌, హైదరాబాద్‌-హదస్పార్‌, విశాఖపట్నం-విజయవాడ, తిరుపతి-విశాఖపట్నం మద్య నడపనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement