Friday, May 3, 2024

Property Tax – ఆస్తి ప‌న్ను ఏటేటా 20 శాతం పెంపుతో వాత …రాష్ట్రాల‌కు కేంద్రం ఆదేశం

అమరావతి, ఆంధ్రప్రభ : ఆస్తి పన్నును ప్రతియేటా 20 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలకు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. స్థానిక ప్రజలపై పన్ను భారం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేస్తోంది. పట్టణ స్థానిక సంస్థలకు తాజాగా ప్రత్యేక సాయం పథకాన్ని నాలుగో దఫాగా ఈ ఏడాదికి కేంద్రం ప్రవేశపెట్టింది. కొన్ని రాష్ట్రాల్రకు రూ.150 కోట్లు- చొప్పున, మరికొన్ని రాష్ట్రాల్రకు రూ.100 కోట్లు- చొప్పున, ఇంకొన్ని చిన్న రాష్ట్రాల్రకు రూ.50 కోట్లు- చొప్పున ఇవ్వనుంది. ఈ సొమ్ము వడ్డీ లేని దీర్ఘకాలిక రుణమే తప్ప గ్రాంటు- కాదు. పట్టణ స్థానిక సంస్థల్లో ఆర్థిక సంస్కరణల పేరిట ఈ రుణం విడుదలతో పాటు- అందుకు సంబంధిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా ఆస్తి పన్నును ఎలా పెంచాలన్నదానిపైనే కేంద్రం షరతుల వంటి సూచనలు చేసింది.

పట్టణ స్థానిక సంస్థలు తమ రుణ యోగ్యతా సర్టిఫికెట్ల పరిస్థితిని మెరుగుపరుచుకోవడం, తద్వారా మున్సిపల్‌ బాండ్లను ప్రకటిస్తూ ఆస్తి పన్ను చెల్లింపులను మరింతగా ప్రోత్సహించేలా చూడడంపైనే ఈ సూచనలు ఉండడం గమనార్హం. దీనికోసం అన్ని రాష్ట్రాల్రూ ప్రత్యేకంగా రోడ్‌ మ్యాప్‌ తయారుచేసుకోవాలని సూచించింది. ప్రత్యేకంగా ఐదు లక్షల మందికన్నా ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఈ రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకోవాలని పేర్కొంది.

ఆస్తి పన్ను కోసం డిజిటల్‌ ప్రాపర్టీ ట్యాక్స్‌ రిజిస్టర్‌ను ఏర్పాటు-చేయాలని కేంద్రం సూచించింది. దీనికి కూడా డ్రోన్‌ బేస్‌డ్‌ -టె-క్నాలజీతో అమలు చేయాలని పేర్కొంది. ఈ రిజిస్టర్‌ను స్టారప్‌ డ్యూటీ-, రిజిస్ట్రేష్రన్‌, రెవెన్యూశాఖల రికార్డులను అనుసంధానం చేయాలని సూచించింది. ఆస్తి పన్ను వసూళ్లు ప్రతియేటా పెరగాలని మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది. కనీసం ఏటా 20 శాతం పెంపు ఉండేలా చూసుకోవాలని పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు పన్ను వసూళ్లు పటిష్టంగా అమలు చేయాలని, అవసరమైతే ఆస్తి పన్నును పెంచాలని కూడా సూచించింది.

ఈ మార్గదర్శకాలను అమృత్‌ నగరాల్లో 10 శాతం అమలు జరిగేలా చూడాలని, అలా చేస్తే ఆయా రాష్ట్రాల్రకు మరో రూ.50 కోట్లు- చొప్పున సాయం పెంచనున్నట్లు- కేంద్రం పేర్కొంది. ఇదిలా వుండగా పట్టణాలు, నగరాల్లో పలు యూజర్‌ ఛార్జీలు పెంచుకోవచ్చని కేంద్రం సూచనలు చేయడం గమనార్హం. ప్రధానంగా నీటి, పారిశుధ్య ఛార్జీలను పెంచడం, సేవా ఛార్జీల్లో ఆపరేషన్‌, మెయిం-టె-నెన్స్‌ ఛార్జీలు పెంచడంపైనా దృష్టి సారించాలని ఈ మార్గదర్శకాల్లో చేసిన సూచనలు రాష్ట్ర ప్రజలపై భారం పడేవిగానే ఉన్నాయి. ఇలా వచ్చిన ఆదాయాన్ని ఎస్కో ఖాతాల ద్వారా నిల్వ ఉంచాలని సూచించింది. ఈ ఆదాయంతోనే ఆయా మున్సిపాల్టీలు భవిష్యత్తులో చేసే అప్పులను తీర్చుకోవాలని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement