Wednesday, May 1, 2024

SCR – డోన్ రైల్వే ప్రాజెక్ట్ ల‌పై మంత్రి బుగ్గ‌న సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో చ‌ర్చ‌లు..

క‌ర్నూలు – రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను కలిశారు. డోన్ నియోజకవర్గానికి మంజూరు చేయవలసిన పలు కీలక రైల్వై ప్రాజెక్టుల గురించి మంత్రి బుగ్గన రైల్వే జీఎంకు వినతి పత్రం సమర్పించారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలోని జీఎం కార్యాలయంలో మంత్రి బుగ్గన సమావేశమయ్యారు. డోన్ నియోజకవర్గంలో ప్రయాణీకుల రద్దీ , తరచూ రైల్వే లైన్ దగ్గర టిక్కెట్ కౌంటర్లు లేక ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో వాటిని గమనించి పరిష్కారం దిశగా మంత్రి బుగ్గన పలు కీలక ప్రాజెక్టుల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కు వినతిపత్రం సమర్పించారు. మంత్రి బుగ్గన ప్రతిపాదనలపై రైల్వే జీఎం కూడా సానుకూలంగా స్పందించారు.

బుగ్గ‌న విన‌తిప‌త్రంలో పేర్కొన్న అంశాలు….
1.డోన్ మున్సిపాలిటీలో ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో ‘రైల్వే అండర్ బ్రిడ్జి’ నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరారు.

  1. డోన్ రైల్వే స్టేషన్ లోని మూడవ ప్లాట్ ఫాం దగ్గర డోన్-గుత్తి రోడ్ వైపున ప్రయాణీకుల వెసులుబాటు కోసం రెండో ‘టిక్కెట్ కౌంటర్’ స్థాపనకు కోరారు.

3.జిందాల్ విజయనగర్ స్టీల్స్ నుంచి పెద్ద ఎత్తున ఖనిజ ఉత్పత్తుల సరఫరా జరిగే నేపథ్యంలో బేతంచెర్లలోని సిమెంట్ నగర్ లో పాణ్యం సిమెంట్ , మినరల్ పరిశ్రమలకు రెండవ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు.

  1. బేతంచెర్లలోని ఆర్.ఎస్ రంగాపురం, చిన్న మల్కాపురం రైల్వైస్టేషన్ లలో ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా ‘ఫుట్ ఓవర్ బ్రిడ్జి’ల ఏర్పాటు చేయాలని కోరారు.
  2. బేతంచెర్లలోని రైల్వే అండర్ బ్రిడ్జి 158ఎ వద్ద రెండవ బిలం (వెంట్) ఏర్పాటు అంశంపై చర్చించారు.

6.ఆర్.ఎస్ రంగాపురం యార్డ్ ను తగిన వనరులను అందజేసి వేగంగా పూర్తికి చొరవ తీసుకోవాలని ప్రతిపాదన చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement