Sunday, April 28, 2024

Prime Minister – “లేపాక్షి” శిల్ప సంపద అద్భుతం – ప్రధాని నరేంద్రమోడీ

శ్రీ సత్య సాయి బ్యూరో, జనవరి 16 (ప్రభన్యూస్) : భారత పురాతత్వ చరితంలో “లేపాక్షి” శిల్ప సంపద ఓ మహా అద్భుతం అని.. దేశ ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శ్రీ సత్యసాయి జిల్లాలో.. చారిత్రాత్మక పర్యాటక పుణ్యక్షేత్రం లేపాక్షిని సందర్శించారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా లేపాక్షి హెలీప్యాడ్ చేరుకున్న ప్రధాన మంత్రి లేపాక్షిలో పాపనాశేశ్వర, వీరభద్ర స్వామి ఆలయాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం లేపాక్షి చారిత్రక విశిష్టత, స్థానిక ప్రఖ్యాత తోలుబొమ్మల కళా ఖండాల విశిష్టత గురించి తెలుసుకున్నారు. భారతీయ చారిత్రక పురాతన వైభవానికి, విజయనగర సామ్రాజ్య సంస్కృతీ, శిల్పకళా సంపదకు ప్రత్యక్ష అనవాళ్లుగా.. లేపాక్షి ఆలయ శిల్పకళా ఖండాలు ప్రతిబింభిస్తున్నాయని ఆయన అభివర్ణించారు. భారతీయ పురాతన చరితాత్మక వారసత్వ సంపదను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.

లేపాక్షికి విచ్చేసిన దేశ ప్రధానిని చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు, బిజెపి కార్యకర్తలు తరలివచ్చారు. ప్రధానమంత్రి పర్యట సందర్భంగా లేపాక్షి క్షేత్రంలో ప్రధాని కార్యాలయ భద్రతాధికారులు, రాష్ట్ర పోలీసు, అధికార యంత్రాంగం కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం గోరంట్ల.మండల పరిధిలోని పాలసముద్రంలో నూతనంగా నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ (నాసిన్) ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ కమీషనర్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, తదితరులు పాల్గొన్నారు

నాసిన్ అకాడమీ ప్రారంభించిన ప్ర‌ధాని

గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్) అకాడమీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేటి సాయంత్రం లాంచ‌నంగా జాతికి అంకితం చేశారు..
ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ , రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ , కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, డా.భగవత్ కిషన్రావ్ కరాడ్, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్,, ర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సందీప్ మల్హోత్ర, సిబిఎస్ఈ చైర్మన్ సందీప్ కుమార్ వర్మ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, అహుడా చైర్ పర్సన్ మహాలక్ష్మి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, నాసిన్ అధికారులు, తదితరులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement