Saturday, May 4, 2024

10 నుంచి ఫ్రంట్ లైన్ వారియర్సకు ప్రికాషనరీ వ్యాక్సిన్ : డీఎంహెచ్ఓ

ఈనెల 10, 11 తేదీల్లో నెల్లూరు జిల్లాలో పని చేస్తున్న వైద్య సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తలకు కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా ప్రికాషనరీ డోస్ ఇవ్వబడుతుందని డీఎంహెచ్ఓ డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ… జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో వ్యాక్సినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయబడుతుంద‌న్నారు. రెండవ డోస్ వేసుకొన్న‌ తరువాత 9 నెలలకు మాత్రమే ప్రికాషనరీ డోస్ ఇవ్వబడుతుంద‌న్నారు. ఈనెల 12, 13 తేదీల్లో జిల్లాలోని ఫ్రంట్ లైన్ సిబ్బందికి, పంచాయతీ రాజ్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, పోలీస్ బెటాలియన్, సిబ్బందికి ప్రికాషనరీ డోస్ ఇవ్వబడుతుందన్నారు. 60 సంవత్స‌రాలు పైబడిన వారందరికీ ప్రికాషనరీ డోస్ ఇవ్వబడుతుంద‌న్నారు. జిల్లాలోని అన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ వారు తమ పరిధిలో గల సిబ్బంది అందరూ 100 శాతం వ్యాక్సినేషన్ వేయించుకొనేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజ్యలక్ష్మీ తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement