Friday, May 3, 2024

Politics – బందరు కోటలో అలజడి! అధికార పార్టీలో ఉక్కిరి బిక్కిరి .. ప్రతిపక్ష నేత‌ల్లో సంబరం

(మచిలీపట్నం, ప్రభ న్యూస్‌ ప్రతినిధి) :రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలకు ఆయా పార్టీల అభ్యర్థులను ఎంపిక చేయడం ఇంతవరకు పూర్తి కాలేదు. ప్రధాన పార్టీలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఒక అడుగు ముందుకు వేస్తే.. తెలుగుదేశం, జనసేన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారులో తెగువ చూపించడం లేదు. ఆయా పార్టీలకు గెలుపు ఎంతో ప్రతిష్టాత్మకం.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా పోటీ- చేస్తుండగా, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలసి ఎన్నికల ఒప్పందంతో ఒక అవగాహనకు వస్తున్నాయి.

చంద్రబాబు నాయుడు మాత్రం కాస్త ముందుకెళ్లి పలు అభ్యర్థులను వెల్లడించారు. ఆయన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తో సంప్రదించకుండా అభ్యర్థులను ప్రకటించడంతో పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర ఆగ్రహంతో తనదైన శైలితో జనసేన పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడంతో జరిగిన తప్పు గ్రహించిన చంద్రబాబు నాయుడు దిద్దుబాటు-తో జాగ్రత్త పడ్డారు. దీనివల్ల చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ను కూర్చుని అభ్యర్థుల ఎంపికలో ఒక అవగాహనకు వచ్చారు.

కానీ అభ్యర్థుల ప్రకటనకు ఇంకా కొంత సమయం పట్టేట్టు-ంది.బీజేపీ జతతో .. ప్రత్యర్థి పటిష్టంభారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి రావడం కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఏ పార్టీతో లాభం ఉంటు-ం దో ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చింది. టీడీపీ, జనసేనతో కలిసి పని చేస్తామని బీజేపీ అగ్రనేత అమిత్షా చెప్పకనే చెప్పారు.

ఈ నేపథ్యంలో మచిలీపట్నం అసెంబ్లీకి త్వరలో జరగబోయే ఎన్నికలకు గెలుపు ఆ పార్టీలకు ఎంతో కీలకం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య తనయుడు కృష్ణమూర్తి (కిట్టు-) ను పోటీ- చేయడానికి, తెలుగుదేశం పార్టీ పక్షాన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ- చేయడానికి ఖరారు చేశారు. ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రకటించడంతో ఎవరికి అభ్యంతరాలు లేవు. కొల్లు రవీంద్ర పేరును చంద్రబాబు నాయుడు పార్టీలో ఎవరితోనూ సంప్రదించకుండా ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ తో మాటమాత్రంగా కూడా చర్చించకుండా ప్రకటించడంతో జనసేన పార్టీలో ఒక్కింత అసహనం చోటు- చేసుకున్నట్లు- ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపైనా జనసేనాని కూడా స్పందించారు.పొత్తులపై వ్యతిరేకంగా మాట్లాడవద్దని తన పార్టీ శ్రేణులకు సూటిగా చెప్పారు.

గెలుపే కొల్లు లక్ష్యం

- Advertisement -

ఈ విషయాన్ని పక్కన పెడితే, వాస్తవంగా మచిలీపట్నం అసెంబ్లీకి కొల్లు రవీంద్ర అన్ని విధాల అర్హుడే. ఆయన ఎన్నెన్నో అవమానాలు, బాధలు భరించాడు. చివరకు జైలుకు కూడా వెళ్ళాడు. ఇవన్నీ శాసనసభ్యులు పేర్ని నాని చేయించారని తనను పూర్తిగా బలహీనుడిని చేసి సంతోషించాలన్నది పేర్ని నాని ఉద్దేశం అన్నది కొల్లు రవీంద్ర అభిప్రాయం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం లో కొల్లి రవీంద్రకు జరిగిన మానసిక క్షౌభ వివరించలేనిది. లెక్కలేనన్ని నిద్రలేని రాత్రులు గడిపారు. తనను ఎంత మానసిక క్షౌభకు గురిచేసిన ఒక లక్ష్యంతో పట్టు-దలతో ఆత్మ్థసర్యంతో నిలబడిన ధీశాలి కొల్లు రవీంద్ర. అందుకే కొల్లు రవీంద్ర మచిలీపట్నం శాసనసభకు పోటీ- చేయడం అన్ని విధాల అర్హుడే.

అసలు సిసలు జనసైనికుడు

జనసేన పార్టీ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్‌ బండి రామకృష్ణ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ- చేసి ఓడిపోయారు. అయినా ఆయన జనసేననే నమ్ముకుని పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు. పార్టీ పరంగా పవన్‌ కళ్యాణ్‌ ఏ బహిరంగ సభ పెట్టిన, అక్కడ బండి రామకృష్ణ ప్రత్యక్షమవుతారు. ఆయనకు క్యాటరింగ్‌ బాధ్యతలు పవన్‌ కళ్యాణ్‌ అప్పచెబుతారు. నాయకులకు, కార్యకర్తలకు భోజనాలలో ఎటు-వంటి ఇబ్బందులు కలగకుండా తన బాధ్యతలను నిర్వహిస్తారు. దీంతో బండి రామకృష్ణ పవన్‌ కళ్యాణ్‌ కు బాగా దగ్గరయ్యారు. రాబోయే ఎన్నికల్లో తనకు పోటీ- చేసే అవకాశం వస్తుందని బండి రామకృష్ణ ఆశించారు. ఇంతలో తెరమీదకు కొల్లు రవీంద్ర రావటంతో…బండి రామకృష్ణ నిరుత్సాహపడలేదు. పార్టీ ముఖ్యంగానీ పదవులు ముఖ్యం కాదని, పార్టీ కోసమే పని చేయాలని నిర్ణయించుకుని పనిచేయాలని నిర్ణయించుకుని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామై కొల్లు రవీంద్ర కు మద్దతుగా ప్రచారంలో జనసైనికులతో బండి రామకృష్ణ పాల్గొంటున్నారు. ఇది మంచి శుభ పరిణామం

జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు సాగాలి.

.ఇదే విధంగా జనసేన నాయకులు కార్యకర్తలు ప్రతి నియోజక వర్గంలోనూ టీడీపీ తో కలిసి పనిచేయాలని రామకృష్ణ కోరుతున్నారు. అన్నిటి కంటే తమ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఏతావాత ఉమ్మడి పార్టీల సమష్టి కార్యాచరణతో… బందరు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయా? లేక గత ఎన్నికల తరహాలో కాపు సామాజిక వర్గం ఓట్ల చీలికతో గట్టెక్కిన పేర్ని నాని.. తనయుడు కూడా విజయం సాధించే అవకాశం ఎంతమేరకో? రాజకీయ విశ్లేషకులకు అందని అంచనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement