Wednesday, May 15, 2024

కర్నూలులో రూ.1.20 కోట్ల వెండి నగలు పట్టివేత

కర్నూలు శివారులోని పంచలింగాల రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద సెబీ పోలీసుల తనిఖీలలో రూ. 1.20 కోట్ల విలువ చేసే వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు.  సెబీ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీల్లో భాగంగా రాత్రి 10 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రం నుండి బెంగుళూర్ కి వెళ్తున్న ఇన్నోవా కారు నెంబర్ టిఎన్-09- బిఎమ్-8743ను ఆపి తనిఖీ చేశారు. బెంగుళూర్ కి చెందిన నవకర్ సిల్వర్ దుకాణానికి చెందిన 10 బ్యాగుల్లో167 కేజీల 425 గ్రాముల వెండి నగలు (చెవి కమ్మలు, కాళ్ళ పట్టీలు, హారాలు, దండలు,ఉంగరాలు, నెక్లేసులు)లను అభిషేక్ అనే వ్యక్తి కారులో తీసుక వస్తుండగా, పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో గుర్తించారు. వెండికి సంబందించిన సరైన ఆధారపత్రాలు లేనందున, తదుపరి విచారణ నిమిత్తం కర్నూలు అర్బన్ తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పంచలింగాల సిఐ మంజుల తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement