Sunday, April 28, 2024

భారీ వర్షాలతో అప్రమత్తమైన పోలీసులు..

తిరుపతి ఇ అర్బన్ పోలీసులు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకునేందుకు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్ప నాయుడు ఆదేశాల మేరకు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. తిరుచానూరు సమీపంలో ఉన్నటువంటి పాడి పేట నక్కల వాగు, ముళ్లపూడి వద్ద ఉన్న కాల్వ దగ్గర జూపార్క్ సమీపంలో ఉదృతంగా వాగు ప్ర‌వ‌హిస్తుండ‌డంతో సహాయక‌ చర్యలు ముమ్మరం చేస్తున్నారు. అవసరమైన చోట రిజర్వాయర్లు, చెరువులు, నీటి వనరుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement