Monday, May 6, 2024

AP: నారా భువనేశ్వరీ నిరసనలకు పోలీసుల అనుమతి నో… మండిపడ్డ మాజీ సిఎం సతీమణి..

రాజమహేంద్రవరం కేంద్రకారాగారం వద్ద చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేటి నుంచి రెండు రోజుల పాటు చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని ఏపీ పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు, భువనేశ్వరిని కలిసి సంఘీభావం ప్రకటించేందుకు టీడీపీ వర్గాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.

మరోవైపు పోలీసుల తీరుపై టీడీపీ మండిపడింది. జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నారా భువనేశ్వరికి సంఘీభావం తెలపడానికి రావద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

నా బిడ్డలను కలువకూడదా… నారా భువనేశ్వరి..

- Advertisement -

చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో..భువనేశ్వరీ మరో సంచలన ట్వీట్ చేశారు. చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రిలో ఉన్న నన్ను మా బిడ్డల్లాంటి కార్యకర్తలు కలవకూడదా..? అంటూ ప్రశ్నించారు భువనేశ్వరీ. నాకు మనోధైర్యం కలిగించేలా టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముంది..? అని భువనేశ్వరీ ట్వీట్ చేశారు. బాధలో ఉన్న అమ్మను కలుస్తామంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులివ్వడమేంటీ..? ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడిది..? అంటూ నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement