Saturday, May 4, 2024

Polavaram Flood Water – తెర‌మీద‌కు మ‌ళ్లీ పోల‌వ‌రం ముంపు వివాదం….

అమరావతి, ఆంధ్రప్రభ : పోలవరం ముంపు సమస్య మళ్ళీ ముందుకొచ్చింది. ఈనెల చివరి నాటికి ఎగువ నుంచి గోదావరికి వరదొలొచ్చే అవకాశం ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం పోలవరం ముంపు సమస్యను మరోసారి తెరమీదకు తీసుకొచ్చింది. పోలవరంలో 35 వేల క్యూసెక్కుల వరద ఉధృతివస్తే భద్రాచ లం పట్టణంతో సహా అనేక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముం దనీ, గత ఏడాది నుంచి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని చెబుతున్నా కేంద్ర జలశక్తితోపాటు- ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన కానరావటం లేదని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి తట్టు-కునేలా స్పిల్‌ వే నిర్మిస్తున్నట్టు- ఏపీ ప్రభుత్వం చెబు తున్నా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందనీ, దీని వల్ల ఏర్పడే బ్యాక్‌ వాటర్‌ ప్లnడ్‌తో 118 గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉందని తెలంగాణ చెబుతోంది. కేవలం 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఆధారంగా బ్యాక్‌ వాటర్‌పై అధ్యయనం చేశా రనీ, 50 లక్షల క్యూసెక్కు ల ప్రవాహ అంచనాపై ఉమ్మడి సర్వే నిర్వహిం చాలని డిమాండ్‌ చేస్తోంది.

తెలంగాణతోపాటు- చత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్రు పోలవరం స్పిల్‌ వే డిజైన్ల ను ఉటంకిస్తూ 68 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందనీ, దీనివల్ల తమ రాష్ట్రాల్ల్రోని లోతట్టు- ప్రాంతాలు మునిగిపోతాయని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. పోలవరం ముంపు వల్ల ఎక్కువ గా నష్టపోయేది తామేనని ఒడిసా అంటోంది. ఎత్తయి న కరకట్టలు నిర్మించడం వల్ల ముంపు పెరుగు తుంది.. ఎత్తయిన కరకట్టల నిర్మాణంతో వరద జలాలు త్వరగా సముద్రంలోకి వెళ్ళవు.. ముంపు ప్రభావాన్ని చాలా రోజుల వరకు ఎదుర్కో వాల్సి ఉంటు-ంది.. దాని ప్రభావం చాలా గ్రామాలపై పడుతుంది..దీనివల్ల ఎదురయ్యే పర్యావరణ సమస్యలపై అధ్యయనం చేయాలి.. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి కొత్తగా అనుమతు లు పొందాల్సిందేనని ఒడిసా డిమాండ్‌ చేస్తోం ది. పోలవరం ముంపు భయాన్ని వ్యక్తం చేస్తున్న రాష్ట్రా ల వాదనల్లో ఎలాంటి హేతుబద్ధత, సాంకేతిక ఆధారా లు లేవని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తో పాటు- ఏపీ ప్రభుత్వం అంటు-న్నాయి.

భారీ వరద తట్టుకునేలా స్పిల్‌ వే
పోలవరం ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కుల వరద అంచనాతో డిజైన్‌ చేసినా 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని తెలంగాణ, 68 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని ఒడిసా, చత్తీస్‌గఢ్‌ చేసే వాదనలు సాంకేతిక అంచనాలకు అందని విషయాలని ఏపీ చెబుతోంది. గోదావరిలో వందేళ్ళలో గరిష్టంగా వచ్చిన వరద 28.5 లక్షల క్యూసెక్కులు మాత్రమే.. 50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు పంపించే సామర్థ్యంతో పోలవరం స్పిల్‌ వే నిర్మిస్తున్నాం.. ఆ డిజైన్‌కు 2009లోనే కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు కూడా ఉన్నాయి.. తెలంగాణ వాదిస్తున్నట్టు- పోలవరానికి 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశమే లేదని కేంద్ర జలశక్తి కూడా స్పష్టం చేసింది.

- Advertisement -

బ్యాక్‌వాటర్‌ సమస్య రాదు
పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధ్యయనం చేసి ముంపు సమస్య రాదనీ, వచ్చే అవకాశమే లేదని సాంకేతికంగా వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక గోదావరిలో భద్రాచలం వద్ద కేవలం 2 సెంటీ-మీటర్ల నీటి మట్టం మాత్రమే పెరుగుతుంది. గోదావరిలో 10 వేల ఏళ్ళకు ఒకసారి 44.61 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని ఐఐటి-హైదరబాద్‌ నివేదిక చెబుతోంది. గోదావరిలో వెయ్యేళ్లకు ఒకసారి వచ్చే వరదను 39.77 లక్షల క్యూసెక్కులుగా ఐఐటి లెక్కకట్టిన సంగతిని ఏపీ గుర్తు చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ పటిష్టమైన స్పిల్‌ వే నిర్మిస్తున్నామని, 124.55 కిలోమీటర్ల పొడవున కరకట్టలు కూడా నిర్మించాల్సి ఉంది..ఈ మేరకు పొరుగు రాష్ట్రాల నుంచి సహకారం కావాలని ఏపీ కోరుతోంది.

ఈ మేరకు డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టం(డీజీపీఎస్‌) నిపుణులతో ప్రభుత్వం ఏరియల్‌ సర్వే చేయించింది. పోలవరం ముంపు గ్రామాలను ఇప్పటికే గుర్తించినా నిర్మాణం కొనసాగుతున్న దశలో వచ్చిన మార్పులు, చేర్పుల ప్రభావంతో కొత్తగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను కూడా డీజీపీఎస్‌ గుర్తించి త్రీడీ చిత్రాల రూపంలో నివేదిక అందించింది. పోలవరం గరిష్ట నీటి మట్టం 45.75 అడుగులు కాగా ఎన్ని అడుగుల వరకు నీరువస్తే ఏ ప్రాంతం ముంపునకు గురవుతుందో తెలుసుకునేందుకు డీజీపీఎస్‌ -టె-క్నాలజీ ఉపయోగిస్తున్నారు.పోలవరం మీదుగా కుక్కునూరు మండలంలోని తెలంగాణ సరిహద్దువరకూ, తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం నుంచి ఎటపాక మండలంలోని తెలంగాణ సరిహద్దు వరకు సర్వే చేపట్టారు. పోలవరం నిర్మాణ ప్రాంతం, ఇప్పటికే గుర్తించిన ముంపు ప్రాంతం, కాంటూరుల చుట్టూ సుమారు 20 సార్లు ఇటీ-వల చాపర్‌ తిరిగి త్రీడీ చిత్రాలను అందించింది. డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టం (డీజీపీఎస్‌)కు శాటిలైట్‌ సిగ్నల్స్‌ అనుసంధానం చేసి త్రీడీ చిత్రాలు తీశారు. వాటి ఆధారంగా డీజీపీఎస్‌ సాంకేతిక నిపుణులు ముంపు ప్రాంతాల నివేదికను రూపొందించారు. కేవలం డీజీపీఎస్‌ సర్వేనే కాకుండా గతంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నియమించిన గోపాలకృష్ణ కమిటీ-..ఆ తరువాత బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) కూడా పోలవరం ముంపుపై సాంకేతికంగా ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయిందని ఏపీ జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement