Thursday, April 25, 2024

స‌రికొత్త లూఠీ – వేలి ముద్ర‌ల క్లోనింగ్ తో బ్యాంక్ ల‌లో సొమ్ము స్వాహా..

అమరావతి,ఆంధ్రప్రభ:బ్యాంకుఖాతాదారులకు దాచుకు న్న తమ నగదుపై ఆందోళన పెరిగిపోతోంది. కొంత మంది ముఠాగా ఏర్పడి ఖాతాదారుల వేలిముద్రలను సేకరించి, వాటిని ఆధార్‌తో అనుసంధానం చేసి బ్యాంకుల్లో వారి ఖాతాల్లో ఉన్న నగదును స్వాహా చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశంపై రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ- (ఎస్‌ఎల్‌సిసి) కూడా సమీక్షించింది. ఇందులో అంతర్‌ రాష్ట్ర ముఠా సభ్యులు కూడా ఉన్నట్లు- పోలీసు దర్యాప్తులో తేలినట్లు- సమాచారం. ఎపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే లక్ష మంది కిపైగా ఖాతాదారుల ఆధార్‌, వేలిముద్రల క్లోనింగ్‌లు ముఠా చేతుల్లో ఉన్నట్లు- తేలింది. ఇటు-వంటి కేసు ఇటీ-వల కడప జిల్లా లో బయటపడింది. ఇక్కడ ఆధార్‌ నెంబరును ఉపయోగించి లబ్ధిదారుని వేలిముద్రను క్లోనింగ్‌ ద్వారా సిద్ధంచేసి బ్యాంకు ఖాతాలోని నగదును దొంగలు దొంగిలిం చినట్లు- తేల్చారు. ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిసిస్టమ్‌ ద్వారా జరిగిన ఈ కేసులో నిందితులు ఇంటర్మీడియ మేమెంట గేట్‌వే యాప్‌ ద్వారా వేలిముద్రలను సేకరించినట్లు- గుర్తించారు.
నిందితులు వేలిముద్రలను క్లోనింగ్‌ చేసేందుకు అవసరమైన మిషన్లను కూడా సేకరించుకుంటు-న్నట్లు- గుర్తించారు.

ఈ విధానం ద్వారా ఖాతాదారులకు వచ్చిన వన్‌-టైమ్‌ పాస్‌వర్డ్‌లను కూడా తెలుసుకుంటు-న్నట్లు- భావిస్తున్నారు. ఈ కేసులో కడప పోలీసులు అరెస్ట్‌ చేసిన విశ్వకర్మ అనే వ్యక్తి నురచి మరిన్ని వివరాలు తెలుసుకున్న అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఇతనిది ఉత్తరప్రదేశ్‌ కావడంతో ఇటు-వంటి కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెరదిన ముఠాలు కూడా ఉన్నట్లు- తేలిరదని రాష్ట్ర స్థాయి అధికారులు చెబుతున్నారు. వారు పాలిమర్‌ షీట్‌, బటర్‌ పేపర్‌, ఫొటోషాప్‌లను ఉపయోగిస్తున్నట్లు- కూడా కనుగొన్నారు. కడప కేసులో అరెస్టు చేసిన నిందితుడే తెలంగాణలోని 117 కేసుల్లో, ఉత్తరాఖండ్‌లో రెండు కేసుల్లో, జార్ఖండ్‌లో మూడు కేసుల్లో, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, గుజరాత్‌, హర్యానాల్లో ఒక్కో కేసులో ఉన్నట్లు- కూడా గుర్తించడం వల్ల ఈ సమస్య దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు- తేలింది. నిందితుల్లో కొంత మంది కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్లను ఏర్పాటు-చేసుకుని, ఈ-గవర్నెన్స్‌, బ్యాంకింగ్‌ సర్వీస్‌ పేరుతో వేలిముద్రలు, ఆధార్‌ కార్డులను సేకరిస్తున్నట్లు- తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement