Wednesday, May 1, 2024

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌లో సిబ్బంది స‌ర్దుబాటు ప్రారంభం…

అమరావతి,ఆంధ్రప్రభ: ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల్లో సిబ్బంది పునర్‌ వ్యవస్థీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని 1150 పీహెచ్‌సీల్లో కూడా సమానంగా సిబ్బందిని ఏర్పాటు చేయడం ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నిర్ణ యించింది. ప్రతి పీహెచ్‌సీల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు ఇద్దరు, స్టాఫ్‌ నర్సులు ముగ్గురు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, సీహెచ్‌ఓ లేదా ఎంపీహెచ్‌ఈఓ, హెల్త్‌ ఎడ్యు కేటర్‌, ఎంపీహెచ్‌ఎస్‌ మెయిల్‌, ఫిమెయిల్‌ జూనియర్‌ లేదా సీనియర్‌ అసిస్టెంట్‌, ఎఫ్‌ఎన్‌ఓ, శానిటరీ అటెం డర్‌ కం వాచ్‌మెన్‌ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 14 పోస్టులు ఉండేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే సర్దుబాట పేరుతో అత్యధిక శాతం పీహెచ్‌సీల్లో సిబ్బం ది క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తయింది. వివిధ కార ణాల వల్ల 30 నుంచి 40 శాతం పీహెచ్‌సీల్లో సిబ్బంది క్రమబద్దీకరణ పూర్తి కాలేదు. ఈక్రమంలో సిబ్బంది పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవ రి 24న ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

షెడ్యూల్‌ ఇలా
పీహెచ్‌సీల్లో సిబ్బంది సర్దుబాటుకు సంబంధించి బుధవారం నుంచి వైద్యశాఖ చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈనెల 10 తేదీన తాత్కాలిక సీనియార్టీ జాబితాను ప్రదర్శిం చనున్నారు. ఉద్యోగుల ద్వారా ఫిర్యాదులు సమర్పణ ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. తుది సీనియార్టీ జాబితాను 18 వ తేదీన ప్రదర్శించను న్నారు. 23,24 తేదీల్లో కౌన్సిలింగ్‌ నిర్వహించి ఆదేశాలు జారీ చేయను న్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమానంగా సిబ్బంది నియామకాలు పూర్తి చేయను న్నారు. సర్దుబాటు ప్రక్రియకు సంబంధించి ఉమ్మడి జిల్లాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. పర్యవేక్షణ సిబ్బంది, కేడర్‌కు ఒకరు చొప్పున ఉండేలా ఏర్పాట్లు చేశారు. కొత్తగా పదోన్నతి పొందిన అన్ని క్యా డర్లకు తుది సీనియార్టీ జాబితాను ప్రదర్శించిన తరు వాత ఉమ్మడి కౌన్సిలింగ్‌ ప్రక్రియ పూర్తి చేసిన తరు వాత మాత్రమే పోస్టింగ్‌ ఇవ్వాలని సంబంధిత అధికా రులకు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ కార్యాలయం నుంచి ఆదే శాలు జారీ చేశారు.

మిగులు సిబ్బందికి చెక్‌
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అడ్డగోలుగా పోస్టింగ్స్‌ ఉండేవి. ఉదాహరణకు ఒక పీహెచ్‌సీలో 20 మంది సిబ్బంది ఉంటే మరో పీహెచ్‌సీలో కేవలం 5గు రు మాత్రమే పనిచేసేవారు. దీంతో వైద్య సేవల విష యంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. కొన్ని పీహె చ్‌సీల్లో అయితే పర్యవేక్షకుల సంఖ్య ఎక్కువ ఉండేది. క్షేత్రస్థాయిలో వైద్య సేవల్లో ఇబ్బందులు ఎదురవుతా యని గ్రహించిన వైసీపీ సర్కార్‌ పీహెచ్‌సీలపై క్రమ బద్దీకరణ అస్త్రాన్ని సంధించింది. అన్ని పీహెచ్‌సీల్లో యూనిఫాంగా 12 మంది సిబ్బంది ఉండేలా జీవో జారీ చేసింది. దీనిపై అప్పట్లో వైద్య ఉద్యోగుల నుంచి అభ్య ంతరాలు వ్యక్తం అయ్యాయి. యూనియన్‌ నాయకు లు రంగంలోకి దిగి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ప్ర తి పీహెచ్‌సీలో 14 మంది సిబ్బంది ఉండేలా జీవో జారీ చేయాల్సిందిగా కోరగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ ప్రక్రియ 60 శాతం పీహెచ్‌సీల్లో పూ ర్తయింది. మిగిలిన పీహెచ్‌సీల్లో నేటి నుంచి క్రమబద్దీ కరణ ప్రక్రియ మొదలు కానుంది. ఈనెలాఖరు నాటికి అన్ని పీహెచ్‌సీల్లో సర్దుబాట ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ అధికారులు కనరత్తు మొదలు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement