Thursday, May 23, 2024

AP: ఇవాళ తెనాలిలో పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్ర…

నేడు తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్ర కొనసాగనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం నాలుగు గంటలకు తెనాలి రానున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

- Advertisement -

ప్రత్యేక హెలికాప్టర్లో తెనాలి చేరుకొని వారాహి వాహనంపై రోడ్ షో నిర్వహించనున్నారు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ లు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మార్కెట్ సెంటర్ లో పుర వేదిక వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఉంది. పవన్ పర్యటన నేపథ్యంలో భారీ గా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన నాయకులు. ఈ మేరకు అన్ని ఏర్పాటుచేశారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement