Sunday, April 28, 2024

AP: సిఎం జగన్ పై దాడి.. స్పందించిన పీఎం మోదీ, పలువురు…

విజయవాడలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన రాయి జగన్ కనుబొమ్మపై భాగంలో తాకింది. దీంతో ఎడమకంటి కనుబొమ్మపై గాయమైంది. వెంటనే జగన్ కు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.

కాగా, సీఎం జగన్ పై రాళ్ల దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర పార్టీల నేతలు స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. మరోవైపు, తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, తదితరులు ఖండించారు.

- Advertisement -

జగన్ పై దాడిని ఖండించిన సీఎం స్టాలిన్..ఏపీ సీఎం జగన్ పై రాయి దాడిని ఖండించారు తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. రాజకీయాల్లో బేధాభిప్రాయాలుంటాయని, అయితే, హింసకు తావులేదన్నారు. ఒకరినొకరు గౌరవించుకోవాలన్నారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని స్టాలిన్ ఆకాంక్షించారు.

జగన్‌పై దాడి…షర్మిల స్పందన…..జగన్ పై రాళ్ల దాడి ఘటనను ఖండించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పై దాడి జరిగి… ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం. అలా కాకుండా, ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని సోషల్ మీడియా వేదికగా షర్మిల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement